ప్రభాస్ సరసన సాయి పల్లవి.. హింట్ ఇచ్చిన రెబల్ స్టార్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించే సినిమాల్లో ఓ రేంజ్ ఉంటుంది.ఆయన సినిమాల్లో నటించే పాత్ర ఒక ఎత్తయితే.

 Hero Prabhas Sensational Comments About Sai Pallavi, Sai Pallavi, Salaar Movie,-TeluguStop.com

అందులో నటించే హీరోయిన్ మరో ఎత్తు.ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ లు అంటే ఆయనకు తగ్గట్టుగా జోడి ఉండాలి, హైట్ ఉండాలి.

అలాగైతేనే సినిమాల్లో హీరో హీరోయిన్ జంటకు ప్రేక్షకులనుండి మంచి పేరు అందుతుంది.అయితే ప్రభాస్ తన సినిమాలో సాయి పల్లవి నటిస్తుందని తన నోటి ద్వారానే తెలిపిన విషయం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
సాయి పల్లవి ఈ హైబ్రిడ్ పిల్ల ప్రభాస్ సరసన నటిస్తుందని తెలపగా అభిమానులంతా నిజంగానే షాక్ కు గురయ్యారు.ఎందుకంటే హైట్ లో తక్కువగా ఉన్నా సాయి పల్లవి ఆరడుగుల అందగాడు ప్రభాస్ తో హైట్ విషయంలో ఎలా సెట్ అవుతుందని.

ఆలోచనలు చేస్తున్నారు.కాగా ఇటీవలే ప్రభాస్ ఇచ్చిన వల్లే సాయి పల్లవి నిజంగానే నటిస్తుందని అర్థమవుతుంది.“హైట్ ప్రాబ్లమ్ లేకపోతే.సాయి పల్లవి నా పక్కన పక్కాగా సూటవుతుంది” అని ప్రభాస్ వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం ఈ విషయం గురించి హాట్ టాపిక్ గా మారింది.

కే జి ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నా ” సలార్” లో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు ఉండగా.ఒక హీరోయిన్ సాయిపల్లవి ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో సాయి పల్లవి నటిస్తే‌ ప్యాన్ ఇండియా లో ఇది మొదటి సినిమా అంటూ టాక్ వచ్చింది.

ప్రస్తుతం నాగచైతన్యతో లవ్ స్టోరీ సినిమా లో బిజీగా ఉన్నా సాయి పల్లవి తమిళం, మలయాళం సినిమాల్లో కూడా బిజీగా ఉంది.

వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న సాయి పల్లవి ఇటీవలే తన రెమ్యునరేషన్ ను పెంచిన విషయాలు తెలుస్తున్నాయి.బహుశా తనకు ఆఫర్లు ఎక్కువగా ఉండటం వల్ల రెమ్యునరేషన్ పెంచినట్లు అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube