మంత్రిగారి కోడలు కాబోతున్న ఫిదా పిల్ల సాయి పల్లవి !       2018-06-12   00:38:27  IST  Raghu V

శేఖర్ కమ్ముల సినిమా ఫిదాతో తెలుగు తెర మీద ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ సినిమా లో తన నటనతో అందరిని ఫిదా చేసేసింది. సహజమైన తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ ఫిదా పిల్ల. భానుమతి ఒకటే పీసు .. హైబరీద్ పిల్ల అంటూ ఆమె చెప్పిన డైలాగులు తెలుగు ప్రేక్షకుల చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి.

-

తాజాగా సాయి పల్లవికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. అదేంటంటే సాయి పల్లవి పెళ్లి. నిజమో అబద్ధమో తెలియదు కానీ తాజాగా సాయి పల్లవి పెళ్లి ఓ మంత్రి కుమారుడితో ఫిక్స్ అయ్యిందనే వార్తా కొద్ది రోజులుగా బాగా ప్రచారం పొందింది.

సాయి పల్లవి మీద మనసుపారేసుకున్న మంత్రిగారి కుమారుడు .. ఆ విషయాన్ని ఆమెకు చెప్పగా ఆమె తిరస్కరించినట్టు.. అయినా అతగాడు పట్టు వీడకుండా తన తండ్రిని రంగంలోకి డిమాడట. సదరు మంత్రిగారు సాయి పల్లవి ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లితండ్రులను అడిగారట. ఇంకేముంది స్వయంగా మంత్రి గారే వచ్చి పిల్లని అడగడంతో వారు కాదనలేక ఒప్పేసుకున్నారట. దీంతో సాయిపట్టవి పెళ్లి ఆ మంత్రి గారి కుమారుడితో ఫిక్స్ అయిపోయిందని వార్తలు గుప్పు గుప్పుమని బయటకి వచ్చేసాయి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.