సౌందర్య బయోపిక్ కి రంగం సిద్ధం... లీడ్ రోల్ లో సాయి పల్లవి

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి సౌందర్య.కన్నడ నుంచి వచ్చిన సౌందర్య మాతృభాషలో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి అందరికి తెలుగమ్మాయిగా చేరువ అయిపొయింది.

 Sai Pallavi Lead Role In Soundarya Biopic-TeluguStop.com

ఎక్కువగా హోమ్లీ పాత్రలకి ప్రాధాన్యత ఇచ్చే సౌందర్య టాలీవుడ్ లో అప్పట్లో ఉన్న స్టార్స్ అందరితో జత కట్టింది.మాయలోడు సినిమాతో రాజేంద్రప్రసాద్ జోడీగా తెరంగేట్రం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఏకంగా 15 ఏళ్ల పాటు తెలుగు సినిమాలలో తనదైన ముద్ర వేసుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

ఆ సమయంలో సౌందర్యకి పోటీగా రమ్యకృష్ణ ఉండేది.తెలుగు అమ్మాయి తరహా పాత్రలు చేయడంతో తెలుగు ప్రేక్షకులు సావిత్రి తర్వాత సౌందర్యనే అంతగా ఆరాధించారు.

 Sai Pallavi Lead Role In Soundarya Biopic-సౌందర్య బయోపిక్ కి రంగం సిద్ధం… లీడ్ రోల్ లో సాయి పల్లవి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆమె హీరోయిన్ గా కెరియర్ ముగిసిన దశలో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.అనుకోకుండా ఎన్నికల ప్రచారానికి వచ్చి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.

సౌందర్య జీవితం తెరిచిన పుస్తకం ఏమీ కాదని కన్నడ నాట వినిపిస్తూ ఉంటుంది.ఆమె కర్నాటకకి చెందిన అమ్మాయి కావడం అక్కడి వారికి సౌందర్య గురించి ఎక్కువ తెలుసు ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ సౌందర్య బయోపిక్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికి ఈ బయోపిక్ కథ ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో త్వరలో ఈ సినిమాని అన్ని సౌత్ బాషలలో తెరకెక్కించే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ కోసం సాయి పల్లవిని ఇప్పటికే సంప్రదించడం జరిగిందని, ఆమె కూడా అంగీకరించిందని తెలుస్తుంది.

#Kannada #Sai Pallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు