ఐటెం సాంగ్స్ గురించి సాయి పల్లవి అభిప్రాయం ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సాయి పల్లవి కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే.

 Sai Pallavi Interesting Comments Item Songs Latest Interview Sai Pallavi, Tollywood, Item Song, Love, Virata Parvam, Rana-TeluguStop.com

మరీ ముఖ్యంగా ఈమె డాన్స్ కి చాలా మంది యువత ఫిదా అయిపోయారు.అలాగే సాయి పల్లవి సినిమాలలో తన అందం అభినయం నటనతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తు ఉంటుంది.

అయితే సాయి పల్లవి కెరిర్ మొదటి నుంచే గ్లామర్ షో విషయంలో కొన్ని పరిమితులను పెట్టుకున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా సినిమా కథల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ తనకు నచ్చిన సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ ఉంటుంది.

 Sai Pallavi Interesting Comments Item Songs Latest Interview Sai Pallavi, Tollywood, Item Song, Love, Virata Parvam, Rana-ఐటెం సాంగ్స్ గురించి సాయి పల్లవి అభిప్రాయం ఇదే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వస్తున్న ఆమె ఇటీవల శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాతో హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే.టాలీవుడ్ హీరో రానా తో కలిసి నటించిన విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది సాయి పల్లవి.

ఈ సందర్భంగా తాజాగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.ఈ నేపథ్యంలోనే ఐటెం, స్పెషల్‌ సాంగ్‌లపై ఆమెకు ప్రశ్న ఎదురయ్యింది.

పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ, రంగస్థలంలోని జిగేలు రాణి లాంటి ఐటమ్ పాటల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని హోస్ట్‌ ప్రశ్నించగా.ఆ ప్రశ్నకు సాయి పల్లవి ఏ మాత్రం ఆలోచించకుండా ఖచ్చితంగా చేయను అని మరు క్షణమే బదులిచ్చింది.

దీనిపై ఆమె వివరణ ఇస్తూ.ఐటెం సాంగ్స్‌ నాకు కంఫర్ట్‌గా ఉండవు.ఒకవేళ భవిష్యత్తులో అలాంటి వాటిలో నటించే అవకాశం వచ్చినా చేయనని చేప్తాను అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.ఎందుకంటే వస్త్రధారణ సరిగా లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది.

అలా వస్త్రధారణ సరిగాలేని దుస్తులలో నేను కంఫర్ట్‌గా ఉండలేను.అందుకే స్పెషల్‌ సాంగ్‌లో నటించలేను.

అసలు నాకు అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా లేదు అని తెలిపింది.అనంతరం ప్రేమ పై తన అభిప్రాయం గురించి అడగగా.

జీవితానికి కెరీర్‌ ఎంత ముఖ్యమో ప్రేమ కూడా అంతే ముఖ్యమని,రెండింటిలో ఏది లేకపోయిన జీవితం సంపూర్ణం కాదు అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది సాయి పల్లవి.ఇక రానాతో ఆమె నటించిన విరాట పర్వం జూలై 1న రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే.

దీనితో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube