పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవంటున్న సాయి పల్లవి

సాయి పల్లవి అనగానే మనకు వెంటనే ఫిదా సినిమాలో భానుమతి పాత్ర గుర్తుకొస్తుంది.ఆ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే తాను ఎంత గొప్ప నటినో అనే విషయం ప్రూవ్ చేసుకుంది.

 Sai Pallavi Happy On Her Movie Career, Tollywood, Kollywood, South Cinema, Telug-TeluguStop.com

ఇక ఆ సినిమాతో ఒక్కసారిగా సాయి పల్లవి ఇమేజ్ మొత్తం మారిపోయింది.అయితే వచ్చిన క్రేజ్ తో స్టార్ హీరోల సినిమాలలో ఎలాంటి పాత్ర అయిన చేయడానికి ఆమె సిద్ధం కాలేదు.

కేవలం తన మనసుకి నచ్చే పాత్రలు, సినిమాలు మాత్రమే చేయడానికి ఆసక్తి చూపిస్తుంది.దీంతో ఆమె చేసిన సినిమాల సంఖ్య తక్కువగానే ఉంది.

అయితే చేసిన ప్రతి సినిమాలో తన బ్రాండ్ కనిపించే విధంగా సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ తో ఆదరగోడుతుంది.ఇక ఆమె చేసిన సినిమాల్లోనే పాటలకి యుట్యూబ్ లో మంచి వ్యూవర్ షిప్ ఉంది.

మంచి నటిగానే కాకుండా మంచి డాన్సర్ గా కూడా సాయి పల్లవి తన సినిమాలతో ప్రూవ్ చేస్తుంది.తన లవ్ స్టొరీ సినిమాలో ఒక పాటకి ఆమె కోరియోగ్రఫీ కూడా చేయబోతుంది.

ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.అవి మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.

ఇక మరో రెండు ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే తన కెరియర్ పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని సాయి పల్లవి చెబుతుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయిపల్లవి పలు విషయాలను వెల్లడించింది.పెద్దపెద్ద సినిమాల్లో నటించాలని, ఏదో సాధించేసేయాలనే కోరికలు తనకు లేవని చెప్పింది.

తన వద్దకు ఏదైనా కథ వస్తే అది తనకు సరిపోతుందా? లేదా? అనే విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తానని తెలిపింది.తనను ప్రేక్షకులు కూడా ఒక పెద్ద హీరోయిన్ గా చూడరని, ఇంట్లో అమ్మాయిగానే చూస్తారని అంటుంది.

కురచ దుస్తులు తాను ధరించలేనని, వాటిని ధరిస్తే తనకు, తనను చూసేవారికి సౌకర్యవంతంగా ఉండదని తెలిపింది.అలాంటి చెప్పేసింది.మొత్తానికి ప్రేక్షకుల మీదకి తోచేసిన తన అభిప్రాయాన్ని సాయి పల్లవి స్పష్టంగా మరోసారి తెలియజేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube