కమెడియన్ తో జత కట్టబోతున్న సాయి పల్లవి  

Sai Pallavi Green Signal To Comedian Movie, Tollywood, Kollywood, VirataParvam Movie,kali charan - Telugu Comedian Movie, Kollywood, Love Story Movie, Sai Pallavi, Tollywood, Virataparvam Movie

సౌత్ లో నటిగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ సాయి పల్లవి. మొదటి సినిమానే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని నటిగా సాయి పల్లవి టాలెంట్ ని అందరికి పరిచయం చేసింది.

TeluguStop.com - Sai Pallavi Green Signal To Comedian Movie

ఇక తెలుగులో తెరంగేట్రం చేసిన ఫిదా సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో ఓ విధంగా సాయి పల్లవిదే డామినేషన్ రోల్.

ఆ పాత్రకి ఒక్కసారిగా యావత్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టిన ఈ రౌడీ పిల్ల తమిళంలో మారి 2లో నటించి రౌడీ బేబీగా ఫేమస్ అయిపొయింది.అయితే సాయి పల్లవి ఏ సినిమా చేసిన అందులో తన పాత్ర ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటుంది.

TeluguStop.com - కమెడియన్ తో జత కట్టబోతున్న సాయి పల్లవి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడం లేదు.ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కూడా తన పాత్రకి ప్రాధాన్యత ఉంది అంటేనే ఒకే చెబుతుంది.

లేదంటే నిర్దాక్షిణ్యంగా చేయనని చెప్పేస్తుంది.అలాగే సరిలేరు నీకెవ్వరూ సినిమాలో హీరోయిన్ అవకాశాన్ని సాయి పల్లవి వదిలేసుకుంది.

చాలా స్టార్ హీరోల సినిమాలు కూడా పక్కన పెట్టింది.

అదే సమయంలో కంటెంట్ బేస్, కొత్తదనం ఉన్న కథలకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

ప్రస్తుతం తెలుగులో ఆమె విరాటపర్వం, నాగ చైతన్యతో లవ్ స్టోరీ సినిమాలు చేస్తుంది.ఈ రెండు సినిమాలపై మంచి పాజిటివ్ బజ్ ఉంది.ఇక లవ్ స్టోరీ మూవీ ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళంలో ఈమె ఓ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

అయితే ఆ కొత్త సినిమాలో ఓ కమెడియన్ హీరో కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.తమిళంలో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న కాళీ చరణ్ హీరోగా చేస్తున్న సినిమాలో నటించడానికి సాయి పల్లవి ఒకే చెప్పినట్లు ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

అందులో హీరోయిన్ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉండటంతో ఆమె చేయడానికి ఒకే చెప్పినట్లు టాక్ నడుస్తుంది.

#Kollywood #Sai Pallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు