పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి !

టాలీవుడ్ లో ఫిదా సినిమాతో తెలుగులో పరిచయ మయి ప్రేక్షకులను ఫిదా చేసింది మలయాళ బ్యూటీ సాయి పల్లవి.చేసింది కొన్ని సినిమాలు అయినా తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దు గుమ్మ.

 Sai Pallavi Green Signal For Pan Indian Movie-TeluguStop.com

కథ నచ్చక పోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా నో అని చెప్పడం ఈ అమ్మడి స్టైల్.అందం, అభినయం, డాన్స్ ఇలా ప్రతి విషయంలో సాయి పల్లవికి సాటి మరే హీరోయిన్ రాదనే చెప్పాలి.

కేవలం నటన మాత్రమే నమ్ముకుంటుంది సాయి పల్లవి.స్కిన్ షో కు ఏమాత్రం ఒప్పుకోదు.అయినా కూడా సాయి పల్లవికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.తాజాగా ఒక పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.

 Sai Pallavi Green Signal For Pan Indian Movie-పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా కోసం సాయి పల్లవి ఒప్పుకుందట.నటనకు ఆస్కారం ఉన్న ఏ పాత్ర చేయడానికైనా సాయి పల్లవి ముందు ఉంటుంది.

తమిళంలో పెద్ద నిర్మాణ సంస్థ అయినా డ్రీమ్ వారియర్ బ్యానర్ లో సాయి పల్లవి ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా తెరకెక్కించ బోతున్నారని సమాచారం.ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమాను గౌతమ్ రామ చంద్రన్తె రకెక్కించ బోతున్నాడట.

ప్రస్తుతం ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.ఇది అన్ని సినిమాల్లాగ కాకుండా కాస్త భిన్నంగా ఉంటుందని తెలుస్తుంది.ప్రస్తుతం సాయి పల్లవి రానా దగ్గుబాటి తో విరాట పర్వం సినిమా, నాగ చైతన్య తో లవ్ స్టోరీ సినిమాలో నటించింది.ఈ రెండు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.

కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.త్వరలోనే ఈ రెండు సినిమాలతో అభిమానులను అలరించబోతుంది.

#Virata Parvam #Indian #Rana Daggubati #SaiPallavi #Naga Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు