ఈసారి కూడా ఆమెకే ప్రాధాన్యత?  

Sai Pallavi Given Importance In Lovestory - Telugu Lovestory, Naga Chaitanya, Sai Pallavi, Sekhar Kammula

టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం లవ్‌స్టోరి రిలీజ్‌కు రెడీ అయ్యింది.అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల.

 Sai Pallavi Given Importance In Lovestory

మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈసారి కూడా ఆమెకే ప్రాధాన్యత-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర ఫిదా మాదిరిగా ఉంటుందని తెలుస్తోంది.అంటే లవ్ స్టోరి చిత్రంలో కూడా సాయిపల్లవి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.

కాగా నాగచైతన్య పాత్రకు ప్రాధాన్యత ఉండదని, ఈ సినిమా కూడా సాయి పల్లవి పేరుపై నడుస్తుందని, సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ మొత్తం ఆమెకే వెళ్లనుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sai Pallavi Given Importance In Lovestory Related Telugu News,Photos/Pics,Images..