మెగా ఆఫర్ కొట్టేసిన ఫిదా పోరి?

ఫిదా చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.ఇప్పటికే వరుస సినిమాలతో సూపర్ హిట్‌లు అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది.

 Sai Pallavi Gets Mega Offer, Sai Pallavi, Chiranjeevi, Vedalam Remake, Tollywood-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆమె నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలు లవ్ స్టోరి, విరాటపర్వం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.రెండు విభిన్న కథాంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా తాజాగా సాయి పల్లవికి ఓ మెగా ఆఫర్ వచ్చినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మెగాస్టార్ చిరంజీవి ఎప్పటి నుండో ఓ తమిళ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావిస్తున్నాడు.

తమిళ హీరో అజిత్ నటించిన ‘వేదాలం’ చిత్రాన్ని తెలుగులో మెహర్ రమేష్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు చిరు రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో చిరు సోదరి పాత్రలో నటించేందుకు చిత్ర యూనిట్ సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఈ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉండనుండటంతో, ఇందులో నటనతో ఆకట్టుకునే బ్యూటీ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది.

మరి మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో ఫిదా బ్యూటీ కనిపిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.మెగాస్టార్ లాంటి హీరో పక్కన స్క్రీన్ పంచుకునే అవకాశాన్ని సాయి పల్లవి వదులుకుంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇక లవ్ స్టోరి చిత్రంలో అక్కినేని నాగచైతన్యతో రొమాన్స్ చేస్తోన్న ఈ బ్యూటీ, విరాట పర్వంలో రానా సరసన నటిస్తోంది.లవ్ స్టోరి చిత్రంలో సాఫ్ట్ అమ్మాయిగా కనిపిస్తున్న ఈ బ్యూటీ, విరాటపర్వం చిత్రంలో డీగ్లామర్ పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube