డిజిటల్ స్ట్రీమింగ్ సిద్ధమైన సాయి పల్లవి గార్గి!

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఈ క్రమంలోనే ఈమె విరాటపర్వం సినిమా తర్వాత గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వంలో కోర్టు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రం గార్గి.

 Sai Pallavi Gargi Ready For Digital Streaming In Sonyliv Details, Sai Pallavi,ga-TeluguStop.com

ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో జూలై 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అనుకోకుండా ఒక అత్యాచార కేసులో ఇరుక్కున్న తండ్రిని ఒక కూతురు ఎలా కాపాడిందనే కథాంశంపై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ విధంగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో మంచి వసూళ్లను రాబట్టింది.ఇక సినిమాలు థియేటర్లో విడుదలైన తర్వాత డిజిటల్ స్క్రీన్ పై విడుదల అవుతాయని మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సాయి పల్లవి నటించిన గార్గి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలీవ్‌ కైవసం చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాని ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నట్లు తాజాగా సోనీ లీవ్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

Telugu Gargi, Gargi Ott, Sai Pallavi, Sonyliv, Tollywood-Movie

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎవరు ఊహించని క్లైమాక్స్ తో అందరిని ఆకట్టుకున్న గార్గి సినిమా ఈ నెల 12వ తేదీ నుంచి ప్రసారం కానుంది అంటూ ఒక వీడియో షేర్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు.ఇక ఈ సినిమా తెలుగు తమిళ కన్నడ భాషలలో కూడా స్ట్రీమింగ్ కానుంది.ఇక ఈ సినిమాని థియేటర్లో మిస్ అయిన వారు డిజిటల్ స్క్రీన్ పై చూసే అవకాశాన్ని కల్పించారు.ఇక ఈ సినిమాల తర్వాత సాయి పల్లవి తన తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube