సాయి పల్లవి మళ్ళీ ట్రెండ్ సృష్టిస్తుందిగా... సాంగ్ టీజర్ తోనే సెన్సేషన్

ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ సాయి పల్లవి.మొదటి సినిమాతోనే నటిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు అటు డాన్స్ తో కూడా ఫిదా చేసేసింది.

 Sai Pallavi Fans Waiting For Saranga Dariya Song-TeluguStop.com

ఈ సినిమాతో ఏకంగా తనకంటూ సపరేట్ ఫ్యాన్స్ బేస్ ని కూడా సాయి పల్లవి ఏర్పరుచుకుంది.ఆమె కోసమే సినిమాలు చూసే ప్రేక్షకులు కూడా ఉన్నారు.

ఇక మొదటి సినిమాతో వచ్చిన ఫేమ్ తో ఈ అమ్మడుకి టాలీవుడ్ లో ఒక్కసారిగా అవకాశాలు వచ్చి పడ్డాయి.ఏకంగా స్టార్ హీరోలతో చేసే ఛాన్స్ కూడా వచ్చింది.

 Sai Pallavi Fans Waiting For Saranga Dariya Song-సాయి పల్లవి మళ్ళీ ట్రెండ్ సృష్టిస్తుందిగా… సాంగ్ టీజర్ తోనే సెన్సేషన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ భామ మాత్రం కేవలం తన పాత్రకి ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు చేస్తానని తెగేసి చెప్పేసింది.అలాగే ఏదో పాటల్లో వచ్చి పోయే పాత్రలలో నటించి టైం వేస్ట్ చేసుకోనని క్లారిటీ ఇచ్చేసింది.

స్టార్ హీరో సినిమా అయినా తన పాత్రకి ప్రాధాన్యత ఉంటేనే నటిస్తూ వచ్చింది.ఈ నేపధ్యంలోనే ఆమె కెరియర్ లో హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సాయి పల్లవి అంటే ఒక బ్రాండ్ అనే విధంగా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో సాయి పల్లవి మానియా నడుస్తుంది.ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది సాయి పల్లవి డాన్స్ కి ఫ్యాన్స్ గా ఉన్నారు.

ఈ నేపధ్యంలో దర్శకులు కూడా ఆమె నటించే ప్రతి సినిమాలో కచ్చితంగా డాన్స్ బీట్ తో ఒక సాంగ్ ఉండేలా చూసుకుంటున్నారు.తాజాగా విరాటపర్వం నుంచి సాయి పల్లవి సోలో సాంగ్ లెరికల్ వీడియోని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణాలో మోస్ట్ పాపులర్ ఫోక్ సాంగ్ సారంగ దరియా సాంగ్ ని సాయి పల్లవి కోసం ప్రత్యేకంగా లవ్ స్టొరీ సినిమాలో పెట్టారు.ఈ పాటలో ఆమె తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో మరింత ఊపు తీసుకొస్తుందని భావిస్తున్నారు.

ఈ సాంగ్ కి సంబందించిన టీజర్ లో శాంపిల్ గా చిన్న డాన్స్ బిట్ పెట్టి పాట ఏ రేంజ్ లో ఉండబోతుంది అనే విషయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించేశాడు.ఈ నేపధ్యంలో ఈ సాంగ్ కోసం సాయి పల్లవి ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విన్న సాంగ్ అయినా కూడా దానికి సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ గా ఉన్నారు.ఈ సాంగ్ తో మరోసారి సాయి పల్లవి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే ఈ సాంగ్ టీజర్ యుట్యూబ్ లో వైరల్ గా మారింది.

#Samantha #Sekhar Kammula #Sai Pallavi #Teaser #SarangaDariya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు