సాయిపల్లవి కొంపముంచిన కరోనా

ఫిదా బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం వరుసగా టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

ఇప్పటికే విరాటపర్వం, లవ్‌స్టోరి చిత్రాలను ఆమె రిలీజ్‌కు రెడీ చేస్తోంది.

అయితే 2018లో కణం, పడ పడి లేచె మనసు అనే రెండు సినిమాలను తీసుకొచ్చిన సాయిపల్లవి ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగలడంతో 2019లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.

దీంతో 2020లో ఆమె వరుసగా సినిమాలు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యింది.

ఈ క్రమంలో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వంలో డీగ్లామర్ రోల్‌లో నటిస్తోంది.