హైబ్రీడ్ పిల్ల ఛత్రపతికి కూడా నో చెప్పిందా?

మలయాళి ముద్దుగుమ్మ సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.తెలుగుతో పాటు తమిళంలో ఈ అమ్మడు సినిమాలు చేస్తూ సౌత్‌ లో మోస్ట్‌ క్రేజీ బ్యూటీగా గుర్తింపు దక్కించుకుంది.

 Sai Pallavi Dont Want To Act In Bellamkonda Movie Chatrapathi-TeluguStop.com

ఈమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే తెలుగులో శ్యామ్‌ సింగరాయ్ ఇంకా పలు ఉన్నాయి.తమిళంలో కూడా సినిమా లు చేస్తోంది.

ఈ సమయంలో నే ఈమెకు పలు సినిమా ల్లో ఆఫర్లు వస్తున్నాయి.కాని ఈమె మాత్రం చాలా తక్కువ సినిమా లకు ఓకే చెబుతోంది.

 Sai Pallavi Dont Want To Act In Bellamkonda Movie Chatrapathi-హైబ్రీడ్ పిల్ల ఛత్రపతికి కూడా నో చెప్పిందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రెండు కోట్ల పారితోషికాలు ఇచ్చినా కూడా ఈమె సినిమా లు చేసేందుకు కొన్నింటికి ఓకే చెప్పడం లేదు.ప్రస్తుతం ఈమె ఒక బాలీవుడ్ ఆఫర్ ను తిరష్కరించింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆ ఆఫర్‌ ను ఇచ్చిన నిర్మాతలు దాదాపుగా రెండున్నర కోట్లకు పైగా ఆఫర్‌ చేశారట.అయినా కూడా ఆమె నో చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.

ఆ రెండున్నర కోట్ల ఆఫర్‌ వివరాల్లోకి వెళ్తే… ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన చత్రపతి సినిమా ను హిందీ లో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే.ప్రస్తుతం హిందీ రీమేక్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.

అందులో భాగంగా రీమేక్ దర్శకడు వివి వినాయక్‌ నటీ నటుల ఎంపిక చేస్తున్నాడు.హీరోయిన్‌ గా మొదట కియారా అద్వానీ మరియు ఇతర హీరోయిన్స్ ను సంప్రదించారట.

కాని కొన్ని కారణాల వల్ల వారు సినిమా లో నటించేందుకు తిరష్కరించారు.దాంతో ఆ సినిమా లో సాయి పల్లవిని నటింపజేయాలని వి వి వినాయక్‌ ప్రయత్నించాడు.

రెండు కోట్లకు పై గా ఆఫర్‌ చేసినా కూడా సినిమా లో పాత్రకు ప్రాముఖ్య త లేకుంటే చేసేది లేదు అంటూ తేల్చి చెప్పింది.సాయి పల్లవి నో చెప్పడం తో ఆ సినిమా ను ఎవరు చేస్తారా అంటూ అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

#Bellamkonda #VV Vinayak #Rajamouli #SaiPallavi #Sai Pallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు