పాపం చైతూ, రానాలను కమ్మేస్తున్న సాయి పల్లవి

ఫిదా సినిమా తర్వాత తెలుగులో సాయి పల్లవి స్టార్‌ డం అమాంతం పెరిగి పోయింది.అద్బుతమైన నటి అంటూ సాయి పల్లవి పై పొగడ్తల వర్షం కురిపించే వారు ఎక్కువ మంది అయ్యారు.

 Sai Pallavi Domination On Rana And Naga Chaitanya-TeluguStop.com

ఆమె డాన్స్ ను అభిమానించే వారు ఎంతో మంది ఉన్నారు.అందుకే ఆమె ను వరుసగా సినిమా ల్లోకి తీసుకునేందుకు పెద్ద హీరోలు మరియు చిన్న హీరోలు అంతా ఆసక్తిగా ఉన్నారు.

సాయి పల్లవి ఉంటే మూడు నాలుగు కోట్ల అదనపు బిజినెస్ పక్కా అనుకుంటున్న ఫిల్మ్‌ మేకర్స్ ఆమెకు కోటికి రెండు కోట్లు పారితోషికంగా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.పెద్ద ఎత్తున ఆమె పారితోషికం పెంచినా కూడా ఆఫర్లు మాత్రం కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.

 Sai Pallavi Domination On Rana And Naga Chaitanya-పాపం చైతూ, రానాలను కమ్మేస్తున్న సాయి పల్లవి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానంటూ ముందు నుండి చెబుతూ వస్తున్న సాయి పల్లవి బ్యాక్ టు బ్యాక్‌ విరాట పర్వం మరియు లవ్‌ స్టోరీ సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

విరాటపర్వం సినిమా ను రానాతో కలిసి చేసిన సాయి పల్లవి లవ్‌ స్టోరీ సినిమా లో నాగ చైతన్యతో కలిసి నటించిన విషయం తెల్సిందే.ఈ రెండు సినిమాల ప్రమోషన్‌ పోస్టర్‌ లు ఇతర సందడి చూస్తుంటే ఎక్కువగా సాయి పల్లవి కనిపిస్తుంది.ఈ ఇద్దరు హీరోల మార్కెట్‌ కంటే అదనంగా నాలుగు అయిదు కోట్ల బిజినెస్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ రెండు సినిమా లు సక్సెస్ అయితే ఆ క్రెడిట్ రానా మరియు చైతూ లకు వచ్చేది అనుమానమే అన్నట్లుగా ఉంది.సాయి పల్లవి తన నటనతో సినిమా లో కూడా వారిద్దరిని కమ్మేసే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

మొత్తానికి ఈ రెండు సినిమాల విషయమై హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా కూడా అసలు సాయి పల్లవి సినిమాలు అన్నట్లుగా ప్రచారం అయితే చేస్తున్నారు.

#SaiPallavi #Naga Chaitanya #SaiPallavi #Rana #Love Story

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు