లవ్ స్టోరీలో మరో ఫీట్ చేస్తున్న సాయి పల్లవి

ఫిదా సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని తనవైపుకి లాగేసుకున్న నటి సాయి పల్లవి.ఈ భామ కెరియర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలు తక్కువే అయినా ప్రతి సినిమాలో తన బ్రాండ్ ఉండేలా చూసుకుంది.

 Sai Pallavi Choreographer For Love Story Movie Song, Tollywood, Telugu Cinema, S-TeluguStop.com

డాన్స్ లలో సత్తా చాట్ సాయి పల్లవి సినిమాలో సాంగ్స్ కి యుట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.కెరియర్ లో చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న ఈ భామ ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమాతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరోసారి లవ్ స్టోరీ మూవీ చేస్తుంది.

ఈ మూవీ మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.కరోనా కారణంగా పెండింగ్ లో ఉన్న మెలిగిన షూటింగ్ కూడా త్వరలో పూర్తి చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ పాత్రతో పాటు మరో రోల్ కూడా చేస్తుంది.ఇప్పుడు దీనికి సంబందించిన సమాచారం ఆసక్తి పెంచుతుంది.

ఈ సినిమా ద్వారా ఆమె కొరియోగ్రాఫర్ కూడా మారుతున్నట్లు తెలుస్తుంది.నిజానికి సాయి పల్లవికి డాన్స్ అంటే చాలా ఇష్టం ఆమె రియాలిటీ షోలలో డాన్స్ ద్వారా అందరికి పరిచయం అయ్యింది.

తెలుగు ఢీషోలో కూడా డాన్స్ లతో అలరించింది.ఈ డాన్స్ టాలెంట్ తోనే ఆమె అందరి హృదయాల్ని గెలుచుకుంది.ఇక ఈ సినిమాలో ఒక పాట ఇంకా షూటింగ్ చేయాల్సి ఉంది.అయితే ఈ పాటని కొరియోగ్రాఫ్ చేయాల్సిందిగా శేఖర్ కమ్ముల సాయి పల్లవికి సూచించినట్లు సమాచారం.

దీంతో ఆమె ఈ సాంగ్ ద్వారా కొరియోగ్రాఫర్ గా చేయాలనే తన కల నెరవేర్చుకుంటుంది అని తెలుస్తుంది.మొత్తానికి హీరోయిన్ గా బెస్ట్ అనిపించుకున్న సాయి పల్లవి కొరియోగ్రాఫర్ గా కూడా ఎంత వరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube