రెండు కోట్ల ఆఫర్ వదిలేసిన సాయి పల్లవి  

bబ్యూటీ ప్రొడక్ట్స్ ప్రమోషన్ చేయనని చెప్పేసిన సాయి పల్లవి. .

Sai Pallavi Avoid Beauty Products Promotion-kollywood,mari 2 Movie,sai Pallavi,tollywood

ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కు కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన నటి సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి తమిళంలో సూర్యకి జోడీగా నటిస్తున్న సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇదిలా ఉంటే ఇక తెలుగులో విరాటపర్వం అనే సినిమాని త్వరలో పట్టాలేక్కించే పనిలో ఉంది..

రెండు కోట్ల ఆఫర్ వదిలేసిన సాయి పల్లవి-Sai Pallavi Avoid Beauty Products Promotion

అలాగే తన దగ్గరకి వచ్చే కథలలో బెస్ట్ సినిమాలని సెలెక్ట్ చేసుకొని తనదైన ముద్ర వేయడానికి సాయి పల్లవి సిద్ధం అవుతుంది. అయితే తాజాగా సాయి పల్లవి ఓ భారీ ఆఫర్ ని ఎ మాత్రం ఆలోచించకుండా వదులుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. హీరోయిన్ తమకంటూ స్టార్ ఇమేజ్ వచ్చాక అదనపు సంపాదన మీద ద్రుష్టి పెడతారు.

అందులో భాగంగా బ్యూటీ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు, అలాగే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కూడా చేస్తారు. అయితే సాయి పల్లవి దగ్గరకి అలాగే ఓ బ్యూటీ ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం రెండు కోట్లు ఆఫర్ చేసింది. కాని ఆమె దానికి నో చెప్పింది.

తాను వాడని వాటిని మార్కెట్ లో ప్రమోట్ చేయలేనని చెప్పి వాళ్ళకి షాక్ ఇచ్చింది. రెండు కోట్లు ఏ మాత్రం ఆలోచించకుండా వదిలేసుకుంది. ఇప్పుడు ఈ సంఘటన సౌత్ ఇండియాలో సంచలనంగా మారింది.