'లవ్ స్టొరీ'ని గుర్తు చేసుకొని ఎమోషన్ అవుతున్న సాయి పల్లవి, చైతూ  

Sai Pallavi And Naga Chaitanya Love Story Movie First Look-sai Pallavi And Naga Chaitanya,sekhar Kammula,tollywood

ఫిదా సినిమాతో టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన భామ సాయి పల్లవి.మొదటి సినిమాతోనే నటిగా తన మార్క్ చూపించిన ఈ భామ కెరియర్ లో చేసిన సినిమాలు తక్కువే అయిన నటిగా మాత్రం ప్రూవ్ చేసుకుంది.

Sai Pallavi And Naga Chaitanya Love Story Movie First Look-sai Pallavi And Naga Chaitanya,sekhar Kammula,tollywood Telugu Tollywood Movie Cinema Film Latest News-Sai Pallavi And Naga Chaitanya Love Story Movie First Look-Sai Sekhar Kammula Tollywood

అయితే ఈ భామకి అదృష్టం కలిసి రాకపోవడంతో తెలుగులో ఫిదా సినిమా తర్వాత చేసిన రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయాయి.అయితే ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

అందులో మొదటి సినిమా దర్శకుడు శేఖర్ కమ్ములతో కలిసి అక్కినేని హీరో నాగ చైతన్యకి జోడీగా నటిస్తుంది.మరో సినిమాలో రానాకి జోడీగా కనిపిస్తుంది.ఇదిలా ఉంటే సంక్రాంతి సందర్భంగా శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ మూవీ ఫస్ట్ లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు.

నాగచైతన్య ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ ని ట్విట్టర్ లో షేర్ చేశాడు.

సంక్రాంతి కానుకగా శేఖర్‌ కమ్ముల టీం ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ దానికి సంబంధించిన పోస్ట్‌ర్‌ను విడుదల చేసింది.ఈ చిత్రానికి‘లవ్‌ స్టోరీ’అనే టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేశారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.సాయిపల్లవి, చైతు లవ్ ని ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉన్న ఈ స్టిల్ సినిమా మీద ఇంటెన్సన్ క్రియేట్ చేసే విధంగా ఉంది.

దీంతో సినిమాపై టాలీవుడ్‌ భారీగానే అంచనాలు పెరిగిపోయాయి.ఈ చిత్రాన్ని నారాయణ్‌దాస్‌ కె.నారంగ్, పి.రామ్మోహన్‌ నిర్మిస్తున్నారు.ఈ వేసవికి సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని దర్శకుడు శేఖర్ కమ్ముల భావిస్తున్నారు.మరి ఫిదా కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమా మరో సారి ప్రేక్షకులని ఫిదా చేస్తుందేమో చూడాలి.

తాజా వార్తలు