యాంకర్‌కు క్లాస్ పీకిన ఫిదా పోరి

టాలీవుడ్‌లో ఫిదా చిత్రంతో తనదైన మార్క్‌ను వేసుకున్న అందాల భామ సాయి పల్లవి, ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ చిత్రంతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

 Sai Pallavi Fires On Anchor, Sai Pallavi, Anchor, Viratparvam, Love Story, Shyam-TeluguStop.com

భానుమతి అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సాయి పల్లవి, ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి.ఇక గోల్డెన్ బ్యూటీగా ఇమేజ్‌ను సొంతం చేసుకన్న సాయి పల్లవి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి సదరు యాంకర్‌పై విరుచుకుపడినట్లు తెలుస్తోంది.ఇటు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ తనదైన మార్క్ వేసుకుని దూసుకుపోతున్న ఈ బ్యూటీ, తనను ఇంటర్వ్యూ చేసిన ఓ యాంకర్‌ను ఎడాపెడా చివాట్లు పెట్టినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మలయాళ బ్యూటీ సాయి పల్లవి అంటూ తనను ఇంట్రొడ్యూస్ చేసిన విధానం సాయి పల్లవికి ఏమాత్రం నచ్చలేదట.దీంతో వెంటనే ఆ యాంకర్‌ను పట్టుకుని గట్టిగా క్లాస్ పీకిందట.

తమిళ కుటుంబానికి చెందిన తాను పుట్టిపెరిగింది కొయంబతూరులో అని ఆమె చెప్పుకొచ్చిందట.తాను మలయాళీ బ్యూటీని ఎలా అవుతానని సదరు యాంకర్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుందట సాయి పల్లవి.

ఇంకెప్పుడు తనను ఇలా మలయాళ బ్యూటీ అంటూ సంబోధించవద్దని గట్టి వార్నింగ్ ఇచ్చిందట.ఏదేమైనా సాయి పల్లవి చేసిన పనికి కోలీవుడ్‌లో ఆమెను ఇంటర్వ్యూ చేయాలనుకునే వారు చాలా జాగ్రత్త పడుతున్నారనే విషయం అక్కడి మీడియా వర్గాల్లో వినిపిస్తోంది.

ఇక ప్రస్తుతం తెలుగులో లవ్ స్టోరీ, విరాటపర్వం, శ్యామ్ సింఘ రాయ్ వంటి సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube