ఆశ చచ్చిపోతోంది అంటూ సాయి పల్లవి ఎమోషనల్…  

Sai palavi, Tollywood heroine, Jayapriya incident, Tamil nadu, Crime news - Telugu Crime News, Jayapriya Incident, Sai Palavi, Tamil Nadu, Tollywood Heroine

ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇలాంటి క్రూరమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నామా.? అనే సందేహం కలగక మానదు.తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన 7 ఏళ్ల చిన్నారిని ముగ్గురు కిరాతకులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది.దీంతో తాజాగా ఈ విషయం పై టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది.

 Sai Palavi Tollywood Heroine Jayapriya

ఇందులో భాగంగా గా ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మానవజాతి పై ఉన్నటువంటి ఆశ రోజురోజుకీ వేగంగా చచ్చిపోతుంది అంటూ ట్వీట్ చేసింది.అంతేకాక ఇలాంటి క్రూర ప్రపంచంలో మహిళలకు రక్షణ కరువైందని, మరో బిడ్డ కి ఎలా జన్మనివ్వడం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

అలాగే చిన్నారికి కచ్చితంగా న్యాయం జరగాలంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపింది.సాయి పల్లవి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆశ చచ్చిపోతోంది అంటూ సాయి పల్లవి ఎమోషనల్…-Latest News-Telugu Tollywood Photo Image

మరి కొందరు నెటిజన్లు నటి సాయి పల్లవి చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ అభం శుభం తెలియని చిన్నారిని చిదిమేసి  హత్య చేసినటువంటి ఆ మృగాలను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.

తెలుగులో టాలీవుడ్ ప్రముఖ హీరో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న  “విరాటపర్వం” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

అలాగే ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన టువంటి “లవ్ స్టోరీ” అనే చిత్రంలో అక్కినేని హీరో నాగ చైతన్య సరసన నటించింది.ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చిత్రీకరణ పనులు కూడా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది.

#Tamil Nadu #Sai Palavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sai Palavi Tollywood Heroine Jayapriya Related Telugu News,Photos/Pics,Images..