అనుష్క బయోపిక్ కి ఒకే చెప్పిన మాటల మాంత్రికుడు  

Sai Madhav Burra Team Up With Singeetham Srninivas - Telugu Anushka Shetty, Biopic, Sai Madhav Burra Team Up With Singeetham, Telugu Cinema, Tollywood

ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారు.అయితే ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకుడుగా మారిపోయి స్టార్ ఇమేజ్ తో కొనసాగుతున్నాడు.

 Sai Madhav Burra Team Up With Singeetham Srninivas - Telugu Anushka Shetty, Biopic, Sai Madhav Burra Team Up With Singeetham, Telugu Cinema, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

ఇప్పుడు ఇండస్ట్రీలో మరో మాటల మాంత్రికుడు ఉన్నాడు.అతడే సాయి మాధవ్ బుర్రా.

వరుసగా సినిమాలకి మాటలు రాస్తూ, తన పెన్ పవర్ తో హీరోలతో అద్భుతమైన డైలాగ్స్ పలికిస్తున్న సాయి మాధవ్ బుర్రా ప్రస్తుతం తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న డైలాగ్ రైటర్ గా ఉన్నాడు.త్రివిక్రమ్ స్టైల్ లో కాకుండా, కాస్తా పొయిటిక్ గా, ప్రజల గుండెల్లోకి దూసుకుపోయే అద్భుతమైన డైలాగ్స్ తో సత్తా చాటుతున్న సాయి మాధవ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకి పని చేస్తున్నాడు.

అనుష్క బయోపిక్ కి ఒకే చెప్పిన మాటల మాంత్రికుడు - Sai Madhav Burra Team Up With Singeetham Srninivas - Telugu Anushka Shetty, Biopic, Sai Madhav Burra Team Up With Singeetham, Telugu Cinema, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

తెలుగులో వరుసగా పెద్ద పెద్ద బయోపిక్ లకి మాటలు అందిస్తున్న అతను ఇప్పుడు మ‌రో బ‌యోపిక్ కి సంతకం చేశాడు.సీనియర్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు చాలా గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టుకొని తెరకెక్కిస్తున్న బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ క‌థ‌కి బుర్రా సాయిమాధ‌వ్ సంభాష‌ణ‌లు అందించ‌నున్నారు.

ఇప్పటికే స్క్రిప్టు ప‌నులు మొద‌లైపోయాయి.నాగ‌ర‌త్న‌మ్మ పాత్ర‌లో అందాల భామ అనుష్క నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.జూన్‌ల‌లో ఈ చిత్రం పట్టాలు ఎక్కించాలని సింగీతం ప్లాన్ చేస్తున్నారు.ఇక సింగీతం లాంటి దిగ్గజ దర్శకుడుతో సాయి మాధవ్ లాంటి స్టార్ డైలాగ్ రిటర్ కలిస్తే ఇక ఆ సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తాజా వార్తలు

Sai Madhav Burra Team Up With Singeetham Related Telugu News,Photos/Pics,Images..