ఒక వైపు చిరంజీవి కోసం మరో వైపు బాలయ్య కోసం ఆ రైటర్‌ ఫుల్‌ బిజీ  

Sai Madhav Burra Script Balayya Chiranjeevi - Telugu B Gopal, Balakrishna, Chiranjeevi, Lucifer Remake, Sai Madhav Burra, Sai Madhav Burra Script To Balakrishna Moie

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య షూటింగ్‌ పూర్తి కాకుండానే 153వ చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది.చిరు తదుపరి చిత్రం లూసీఫర్‌ రీమేక్‌ అనే విషయం తెల్సిందే.

 Sai Madhav Burra Script Balayya Chiranjeevi

లూసీఫర్‌ను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా పూర్తిగా మార్చేశారు.సినిమాను మాస్‌ ఎంటర్‌టైనర్‌గా మార్చేశారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన డైలాగ్‌ వర్షన్‌ ను సాయి మాధవ్‌ బుర్రా రూపొందిస్తున్నాడు.ప్రస్తుత రచయితల్లో సాయి మాధవ్‌ బుర్రా టాప్‌లో ఉన్నాడు.

ఒక వైపు చిరంజీవి కోసం మరో వైపు బాలయ్య కోసం ఆ రైటర్‌ ఫుల్‌ బిజీ-Movie-Telugu Tollywood Photo Image

ఒక వైపు చిరంజీవి కోసం లూసీఫర్‌ రీమేక్‌ స్క్రిప్ట్‌కు డైలాగ్‌ వర్షన్‌ రాస్తున్న సాయి మాధవ్‌ బుర్రా మరో వైపు బాలకృష్ణ మూవీకి స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడనే సమాచారం అందుతోంది.ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో మోనార్క్‌ చిత్రాన్ని చేస్తున్న బాలయ్య తదుపరి చిత్రం బి గోపాల్‌ దర్శకత్వంలో చేయనున్నట్లుగా తెలుస్తోంది.

వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.అందుకే ఇప్పుడు మళ్లీ గోపాల్‌కు ఛాన్స్‌ ఇచ్చాడు.

బి గోపాల్‌ ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా స్క్రిప్ట్‌ను రెడీ చేయడం కష్టం.అందుకే ఆ బాధ్యతను బాలకృష్ణ రచయిత సాయి మాధవ్‌ బుర్రాకు అప్పగించాడు.ఈ రెండు సినిమాలతో పాటు ప్రస్తుతం ఆయన చేతిలో పదుల సినిమాలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.అద్బుతమైన డైలాగ్స్‌ను రాయగల సత్తా ఉన్న రచయిత సాయి మాధవ్‌ బుర్రా.

అందుకే యంగ్‌ సీనియర్‌ హీరోలు ఆయన వెంట పడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test