సినిమానే ప్రపంచం.. ఎన్నో కష్టాలు పడ్డాను.. అది చూసి ఛాన్స్ ఇచ్చారు?

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి రాణించాలంటే అది అంత సులభమైన విషయం కాదు.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో అవకాశాలు రావడం అంటే కేవలం అదృష్టం మాత్రమే పనిచేస్తుంది అని చెబుతూ ఉంటారు సినీ విశ్లేషకులు.

 Sai Madhav Burra Life Story And Career Struggles Details, Writer Sai Madhav Burr-TeluguStop.com

ఇలా ఎంతోమంది సినిమాల మీద ఫ్యాషన్ తో ఇండస్ట్రీలోకి రావాలని ఆశ తో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తూ ఉంటారు.ఇక ఆ తర్వాత ఒకానొక సమయంలో వారి కెరియర్ లో ఎదుర్కొన్నా సవాళ్లను గురించి చెబుతూ ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతూ ఉంటారు.

ఇక ఇటీవలే తన కెరియర్లో ఎదురైన సవాళ్లకు సంబంధించిన విశేషాలను చెప్పుకొచ్చారు బుర్రా సాయిమాధవ్.

రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆయన తక్కువ సమయంలోనే సినిమా రైటర్ గా మారిపోయాడు.

ఇప్పుడు ఎన్నో సినిమాలకు రైటర్ గా పనిచేస్తూ ఫుల్ బిజీగా అయిపోయారు.అయితే కెరీర్ మొదట్లో ఎదురైన అనుభవాలను ఇటీవలే పంచుకున్నారు ఆయన.నేను సినిమా కష్టాలు ఎన్నో అనుభవించాను.అప్పట్లో అమ్మమ్మ గారు వెయ్యి రూపాయలు ఇచ్చి నన్ను  పంపించేవారు.

అవి కేవలం రోజుల వ్యవధిలోనే ఖర్చయ్యేవి.ఇక ఆ తర్వాత జేబులో డబ్బులు లేక ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను.

ఇక నాకు వచ్చిన కష్టాలను కూడా ఒక అడ్వెంచర్ గా ఫీల్ అవుతూ ముందుకు సాగే వాడిని.నిజంగానే నాకు ఎదురైన సమస్యలు మంచి అనుభవాలు గా నన్ను నేను మరింత మెరుగ్గా మార్చుకోవడానికి నాకు ఉపయోగపడ్డాయి అంటూ రైటర్ సాయి మాధవ్ చెబుతున్నారు.

Telugu Career, Krish, Saimadhavburra, Tollywood, Writersai-Movie

ఇక నేను మొదటినుంచి ప్రతీ విషయాన్ని సినిమాలతో పోల్చుకుంటూనే వచ్చాను ఎన్నో కష్టాల్లో ఉన్న సమయంలో సీరియల్ డైరెక్టర్ రామచంద్ర వర్మ మొదటి అవకాశం ఇచ్చి అండగా నిలిచారు.ఆయనకు నా రైటింగ్ బాగా నచ్చడంతో డైలాగ్స్ కూడా రాయమన్నారు.అయన దర్శకత్వం వహించిన అభినందన అని టెలి ఫిలిం కి నేను మొదటగా స్టోరీ అందించగలను.

Telugu Career, Krish, Saimadhavburra, Tollywood, Writersai-Movie

ఆ తర్వాత పుత్తడిబొమ్మ డైలీ సీరియల్ కి కూడా రాశాను.ఆ తర్వాత గుర్తింపు వచ్చింది.ఇక ఇది చూసిన తర్వాత కృష్ణం వందే జగద్గురుం సినిమాకు డైలాగ్స్ రాసేందుకు దర్శకుడు క్రిష్ ఈ అవకాశం ఇచ్చారు.

ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం బిజీగా గడుపుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు రైటర్ సాయిమాధవ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube