బాలయ్యకు అలాంటి సినిమాలు అయితేనే కరెక్ట్!

తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గురించి తెలియని వారెవరూ లేరు.ఇక ఆయన నటించే నటన గురించి అందరికీ తెలిసిందే.

 Sai Madhav Burra About Balakrishna Action Scenes, Sai Madhav Burra, Balakrishna-TeluguStop.com

బాలకృష్ణ నాటి నుండి నేటి వరకు తనదైన గుర్తింపు తో సినిమాలలో మంచి విజయాన్ని సాధించుకుంటున్నాడు.ఇప్పటికీ హీరో గా ఎంట్రీ ఇస్తూ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటున్నాడు.

నందమూరి బాలకృష్ణ ఎక్కువగా నటించే సినిమాలలో ఎమోషనల్, యాక్షన్ వంటి సన్నివేశాలతోనే ఉంటాయి.నిజానికి బాలకృష్ణ కు యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషనల్ సినిమాలే బాగా హిట్ అవుతాయి.

ఈ విషయం ఇంతకు ముందు కొందరు దర్శకులు ఎన్నోసార్లు తెలిపారు.బాలకృష్ణకు ఎక్కువగా ఫ్యామిలీ తో కనెక్ట్ అయిన సినిమాలను చూసినట్లయితే అవి మంచి విజయాన్ని సాధించినవే.

Telugu Balakrishna, Balayya, Boyapati, Audience, Sai Madhav, Saimadhav, Tollywoo

ఇదిలా ఉంటే బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన నరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఫ్యామిలీ, యాక్షన్ తో వచ్చిన ఈ సినిమాలు ఇప్పటికీ బాగా ఆకట్టుకుంటాయి.ఎక్కువ సెంటిమెంట్ తో, ఎమోషన్ తో, యాక్షన్ తో కూడిన ఈ సినిమాలే కాకుండా మరెన్నో సినిమాలు కూడా బాలకృష్ణకు మంచి విజయాన్ని అందించాయి.ఇక మరోసారి బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా వస్తుందంటే బాలకృష్ణ అభిమానులకు శుభవార్తే అని అర్థమవుతుంది.బాలకృష్ణ నటించిన ముందు సినిమాలకు, ఇప్పుడు వస్తున్న సినిమాలకు కాస్త ట్రెండ్ మారినా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చే కథకు మాత్రం ట్రెండ్ మారేది లేదంటున్నారు.

అంతేకాకుండా ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ ఈ సినిమాకు కథను అందిస్తున్నారట.

ఇక సాయి మాధవ్ మాట్లాడుతూ.బాలకృష్ణ అంటేనే సెంటిమెంట్ ప్లేస్ ఎమోషన్ ప్లస్ యాక్షన్ ఈ మూడింటిని సమానంగా తీసుకొని నటించే బాలకృష్ణ సినిమాలకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని తెలిపాడు.

అంతేకాకుండా బాలకృష్ణ తో తాను చేయబోయే కథ కూడా ఈ మూడింటితో కూడి ఉంటుందని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube