కరోనాపై సాయి కుమార్ ఫ్యామిలీ షార్ట్ ఫిల్మ్  

Sai Kumar Family Short Film On Corona - Telugu Corona Effect, Covid-19,, Telugu Cinema, Tollywood

కరోనాపై దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో సెలబ్రిటీలు తమవంతు భాగం అవుతూ ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు. లాక్ డౌన్ వేళ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రజలని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 Sai Kumar Family Short Film On Corona

ఇదిలా మరో వైపు లాక్ డౌన్ వేళ సినీ కళాకారులకి సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు.ఇక కరోనాపై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ అందరూ కలిసి ఫ్యామిలీ అనే షార్ట్ ఫిలిం తీసారు.

ఇప్పుడు నటుడు సాయి కుమార్ కూడా తనవంతుగా కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బంది సేవలని కొనియాడుతూ షార్ట్ ఫిలిం రూపొందించారు.

కరోనాపై సాయి కుమార్ ఫ్యామిలీ షార్ట్ ఫిల్మ్-General-Telugu-Telugu Tollywood Photo Image

సాయి కుమార్ తన కుమారుడు ఆది, కుమార్తె జ్యోతిర్మయితో కలిసి ఈ షార్ట్ ఫిలిం తీసారు.

ఇందులో డాక్టర్ పాత్రలో జ్యోతిర్మయి, పారిశుద్ధ్య కార్మికుడి పాత్రలో ఆది, పోలీసు పాత్రలో సాయికుమార్ నటించారు.పోలీస్, పబ్లిక్ ఒకటైతే కరోనాను తరిమివేయగలమని, అంతిమ విజయం మనదే అంటూ సాయికుమార్ విశ్వాసం వ్యక్తం చేయడంతో పాటు, ఇలాంటి విపత్కర సమయంలో విధి నిర్వహణలో ఈ మూడు విభాగాలు ఎంత బాధ్యతాయుతంగా పని చేస్తున్నాయి.

వారికి ప్రజలు సహకరించాల్సిన ఆవశ్యకత గురించి ఇందులో చూపించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sai Kumar Family Short Film On Corona Related Telugu News,Photos/Pics,Images..