సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తరువాత కొంతమంది కేవలం కొన్ని రకాల పాత్రలకు మాత్రమే పరిమితం అవుతుంటారు.హీరోలు కేవలం హీరోలుగా మాత్రమే చేస్తూ ఉంటారు.
అయితే ఇటీవలి కాలంలో హీరోగా చేసిన వారు అటు ఇతర పాత్రలు చేసేందుకు కూడా చేసేందుకు సిద్ధమవుతున్నారు.కానీ కొంతమంది మాత్రం కేవలం హీరో గానే పరిమితం అవుతున్నారు అనే విషయం తెలిసిందే.
కానీ మనం మాట్లాడుకునే వ్యక్తి మాత్రం హీరో క్యారెక్టర్ల దగ్గరి నుంచి మొదలుపెడితే సపోర్ట్ ఆర్టిస్ట్ వరకు అన్ని రకాల పాత్రలు చేసాడు.కేవలం నటించడమే కాదు ఎంతో మంది హీరోలకు తన గాత్ర దానం చేసే పాత్రలకు ప్రాణం పోశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇంతలా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అంటే ఆ నటుడు ఎవరో మీకు అర్ధం అయి ఉంటుంది.అతను ఎవరో కాదు విలక్షణ నటుడు సాయి కుమార్. కేవలం సాయికుమార్ మాత్రమే కాదు ఆయన కుటుంబంలో ఉన్న సభ్యులు అందరూ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో సేవలందిస్తున్నారు అని చెప్పాలి.
అంతేకాదు ఇక సాయికుమార్ కుటుంబం గురించి చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది పవర్ ఫుల్ వాయిస్.అవును శర్మ సాయికుమార్ రవిశంకర్ సోదరులు అందరు కూడా ఇప్పటివరకు ఎంతో మందికి డబ్బింగ్ చెప్పారు.
ఇప్పటివరకూ సాయికుమార్ డబ్బింగ్ చెప్పిన సినిమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.భాష సినిమాలో రజనీకాంత్ కు సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు.అంకుశం సినిమాలో రాజశేఖర్ కు డబ్బింగ్ చెప్పారు.ఆహుతి, అల్లరి ప్రియుడు, ఎవడైతే నాకేంటి, పిఎస్వి గరుడ వేగా సినిమాలలో కూడా అటు సాయికుమార్ రాజశేఖర్‌కు డబ్బింగ్ చెప్పడం గమనార్హం.
కేవలం రాజశేఖర్ తోపాటు బావ బావమరిది, సితార సినిమాలో హీరో సుమన్ కి కూడా సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం గమనార్హం.అంతేకాకుండా భాష పెదరాయుడు లాంటి రజనీకాంత్ సినిమాలకు కూడా డబ్బింగ్ చెప్పాడు సాయి కుమార్.