వామ్మో.. తెలుగు కేజీఎఫ్‌ 2ను మోయడం నావళ్ల కాదన్నాడట!  

Sai Korrapati Kgf2 Movie Rights - Telugu Kgf 2 Movie Rights, Kgf2, Kgf2 Telugu Remake Rights, Sai Korrapati

కేజీఎఫ్‌ సినిమాను తెలుగులో సాయి కొర్రపాటి డబ్‌ చేసిన విషయం తెల్సిందే.ఇక్కడ పెద్ద ఎత్తున ఆయనకు లాభాలు తెచ్చి పెట్టింది.

 Sai Korrapati Kgf2 Movie Rights

పెట్టిన మొత్తంకు డబుల్‌ వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.ఇక కేజీఎఫ్‌ 2 ను కూడా ఆయన్నే తీసుకోమంటూ నిర్మాతలు కోరారట.

కేజీఎఫ్‌ 2కు ఉన్న బజ్‌ నేపథ్యంలో తెలుగు రీమేక్‌ రైట్స్‌ను పాతిక కోట్లకు అమ్మాలని భావించారు.కాని సాయి కొర్రపాటి అందుకు ఆసక్తిగా లేడని తెలుస్తోంది.

వామ్మో.. తెలుగు కేజీఎఫ్‌ 2ను మోయడం నావళ్ల కాదన్నాడట-Movie-Telugu Tollywood Photo Image

కేజీఎఫ్‌ 2 చిత్రంను తెలుగులో అంత మొత్తంకు కొనుగోలు చేస్తే వర్కౌట్‌ అయ్యేనా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అందుకే సాయి కొర్రపాటి ధైర్యం చేయలేక పోతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలోనే టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఈ సినిమాను అంత మొత్తంకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు.ఈ విషయంలో చర్చలు కూడా దాదాపుగా పూర్తి అయినట్లుగా సమాచారుం అందుతోంది.

కేజీఎఫ్‌ 2 చిత్రం దేశ వ్యాప్తంగా భారీ మొత్తానికి అమ్ముడు పోయింది.కేవలం థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా 250 కోట్ల వరకు రాబట్టినట్లుగా తెలుస్తోంది.ఇప్పటి వరకు ఏ కన్నడ సినిమా ఇంతటి భారీ మొత్తాన్ని రాబట్టలేదు అంటున్నారు.హిందీలో ఈ సినిమా 150 కోట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగబోతుంది.మరి అది ఎంత వరకు సాధ్యం అయ్యేనో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు