ప్రమాదం గురించి తేజుకు ముందే తెలుసా?

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సంగతి యావత్ టాలీవుడ్‌ను ఒక్కసారిగా షేక్ చేసింది.ప్రమాదం గురించి తెలుసుకున్న మెగా ఫ్యామిలీతో పాటు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని, తేజు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన విషయం మనం చూశాం.

 Sai Dharam Tej Was Warned About The Accident-TeluguStop.com

అయితే తేజు ప్రమాదం నుండి కోలుకుంటున్నాడని, ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ మెరుగుపడుతుందని, అభిమానులు చింతించాల్సిన అవసరం లేదని డాక్టర్లు పేర్కొన్నారు.ఇక తేజు ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

కాగా తేజు ప్రమాదం గురించి పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు.అయితే తాను ప్రమాదానికి గురవుతానని తేజుకు ముందే తెలుసని ఓ వార్త ఇప్పుడు తాజాగా వినిపిస్తోంది.

 Sai Dharam Tej Was Warned About The Accident-ప్రమాదం గురించి తేజుకు ముందే తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినీ ప్రముఖులకు జ్యోతిష్యం చెప్పే ఓ జ్యోతిష్యుడు తేజుకు త్వరలోనే చెడు గడియలు రాబోతున్నాయని, అనుకోని ప్రమాదంలో తాను పడతాడని ఆ జ్యోతిష్యుడు హెచ్చరించాడట.అయితే దీనిని నివారించేందుకు ఓ పూజా హోమం చేయాలని ఆయన సూచించాడని, తేజు కూడా త్వరోలనే ఈ పూజ చేసేందుకు రెడీ అయ్యాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

కానీ ఇంతలోనే ఆయన ప్రమాదానికి గురికావడం జరిగింది.

ప్రమాదం గురించి ముందే తెలుసుకుని, దానిని నివారించే ప్రయత్నం చేసేందుకు సిద్ధమైనా తేజుకు రోడ్డు ప్రమాదం తప్పలేదు.

ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.అయితే కొందరు మాత్రం తేజు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్నప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండి ఉంటే బాగుండేది అంటున్నారు.

ఏదేమైనా తేజు ప్రమాదానికి గురికావడంతో అనేక మీడియా, వెబ్‌సైట్లు కావాల్సినంత స్టఫ్ దొరికింది.దీంతో రోజంతా తేజు రోడ్డు ప్రమాదం గురించే వారు ప్రచారం చేస్తూ సామాన్య ప్రేక్షకుడికి చిరాకు తెప్పించారనేది వాస్తవం.

#Sai Dharam Tej #SaiDharam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు