వరల్డ్ ఫేమస్ లవర్‌గా ఉండాల్సిన హీరో సోలోగా మిగిలాడట!  

Sai Dharam Tej Was First Choice For World Famous Lover, Sai Dharam Tej, World Famous Lover, Vijay Devarakonda, Solo Brathuke So Better - Telugu Sai Dharam Tej, Solo Brathuke So Better, Vijay Devarakonda, World Famous Lover

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూసిన విజయ్, సినిమాలో కొత్తదనం లేకపోవడంతో ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు.

 Sai Dharam Tej Was First Choice For World Famous Lover

ఈ సినిమాలో ఏకంగా నలుగురు భామలతో మనోడు చేసిన రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమాను తొలుత విజయ్ దేవరకొండతో కాకుండా మరో హీరోతో చేయాలని చిత్ర దర్శకుడు క్రాంతి మాధవ్ భావించాడట.

వరల్డ్ ఫేమస్ లవర్‌గా ఉండాల్సిన హీరో సోలోగా మిగిలాడట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు ఇందులో హీరోగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ను అనుకున్నాడట సదరు డైరెక్టర్.ఇక ఈ సినిమాలో నటించాలంటూ ఆయన తేజును కోరగా, కథ విన్న తరువాత అది నచ్చకపోవడంతో తేజు ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట.

దీంతో చేసేదేమీ లేక తన కథను మరో యంగ్ హీరో శర్వానంద్‌కు వినిపించగా, తన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాకు నో చెప్పాడట.అయితే ఈ ఆఫర్ కాస్త విజయ్ దేవరకొండకు వెళ్లడం, ఆయన వెంటనే ఓకే చేయడంతో వరల్డ్ ఫేమస్ లవర్ రెడీ అయ్యాడు.

కానీ ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో విజయ్ దేవరొండతో పాటు చిత్ర యూనిట్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.ఒకవేళ ఈ సినిమాను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదో అని పలువురు ఎక్స్‌పర్ట్స్ ఇప్పుడు లెక్కలు వేస్తున్నారు.

ఏదేమైనా ఆ మూవీని చేయకపోవడంతో తేజు కెరీర్‌లో మరో ఫ్లాప్ రాకుండా జాగ్రత్త పడ్డాడని మెగా ఫ్యా్న్స్ అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sai Dharam Tej Was First Choice For World Famous Lover Related Telugu News,Photos/Pics,Images..