సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే?

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఈ సమయంలోనే ఆయన దేవకట్టా దర్శకత్వంలో నటించినటువంటి రిపబ్లిక్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

 Sai Dharam Tej Rupublic Movie Completed Censor Got Ua Certificate, Sai Dharam Te-TeluguStop.com

పొలిటికల్ థ్రిల్లర్‌ రిప‌బ్లి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు.ఇందులో సాయి ధరమ్ తేజ్ ఒక ఐఏఎస్ పాత్రలో కనిపించగా సాయి తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

సామాజిక అంశాలను ప్రధానాంశాలుగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించడంతో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఈ సినిమా ఉండబోతోందని దర్శకుడు వెల్లడించారు.

ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఎ స‌ర్టిఫికేట్‌ ఇవ్వడమే కాకుండా అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాని అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఉన్నటువంటి పోస్టర్ను చిత్రబృందం విడుదల చేశారు.

ఇందులో సాయి ధరమ్ తేజ్ టోపీ పెట్టుకొని చాలా ఇంటెన్సివ్ లుక్ లో కనిపిస్తున్నారు.సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించన విధంగా ఈ సినిమాలో ఐఏఎస్ పాత్రలో నటించడం,ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లను బట్టి చూస్తే ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది.ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండడం కొంతవరకు బాధ కలిగించే విషయం అని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ సినిమాలో రమ్యకృష్ణ జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube