ప్రస్థానం దర్శకుడుతో తేజు నెక్స్ట్ సినిమా

వెన్నెల సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు దేవకట్టా.మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేసుకున్న ఈ దర్శకుడు తర్వాత ప్రస్థానం సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించాడు.

 Sai Dharam Tej To Team Up With Deva Katta Next-TeluguStop.com

ఆ సినిమా ఒక మోస్తరుగా ఆడిన కూడా తరువాత సంచలనంగా మారింది.ఇప్పటికి ఈ సినిమా టీవీలో ప్రసారం అయితే చాలా మంది చూస్తారు.

రాజకీయాల కోసం మనుషులు ఎలా మారిపోతారు.వారి మధ్య ఎమోషన్స్ ఎలా చచ్చిపోతాయి అనే ఎలిమెంట్స్ తో అద్భుతంగా ఆవిష్కరించిన దేవకట్టా తరువాత ఆటో నగర్ సూర్య అంటూ చైతూతో వచ్చాడు.

అయితే అది కూడా పర్వాలేదని అనిపించుకున్న కమర్షియల్ హిట్ కాలేదు.

ఇక బాహుబలి ప్రీమేక్ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు.

గత ఏడాది ప్రస్థానం సినిమాని సంజయ్ దత్ తో హిందీలో రీమేక్ చేసిన అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.అయితే ఇప్పుడు దేవకట్టా తేజ్ కి అదిరిపోయే మాస్ స్టొరీని చెప్పాడు.

ఈ స్టొరీ తేజుకి కూడా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.వరుస హ్యాట్రిక్ విజయాలతో ఉన్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరు సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుంది.ఈ సినిమా తర్వాత దేవకట్టా సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తుంది.

ఇది కూడా దేవకట్టా గత సినిమాల ఫ్లేవర్ లోనే ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube