కృష్ణగాడి లవర్‌కు మెగా ఆఫర్‌

నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే విడుదలైన చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’.ఈ చిత్రం సక్సెస్‌ను సాధించింది.

 Sai Dharam Tej To Romance With Mehreen-TeluguStop.com

ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మెహ్రీన్‌కు సైతం మంచి గుర్తింపు దక్కింది.అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకున్న మెహ్రీన్‌కు సినిమా విడుదలకు ముందు నుండే ఆఫర్లు రావడం ఖాయం అని చిత్ర యూనిట్‌ సభ్యులు భావించారు.

అనుకున్నట్లుగానే మెహ్రీన్‌కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.ఈమె రెండవ సినిమానే మెగా హీరోతో చేసే అవకాశాన్ని దక్కించుకుంది.

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ త్వరలో నటించబోతున్న సినిమాలో ఈ అమ్మడిని హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది.దిల్‌రాజు నిర్మాణంలో ‘వాంటెడ్‌’ వంటి చెత్త చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రవి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది.

రవి గతంలో ఫ్లాప్‌ అయినప్పటికి నిర్మాత దిల్‌రాజు మరియు హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నమ్మకంతో ఆయనతో సినిమాను చేయాలని నిర్ణయించుకున్నారు.ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్‌ను ఎంపిక చేసేందుకు దిల్‌రాజు చర్చలు జరుపుతున్నాడు.నానితో మంచి రొమాన్స్‌ను పండిచిన మెహ్రీన్‌ మెగా హీరోతో కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube