రిపబ్లిక్ ప్రమోషన్స్‌కు సాయి తేజ్ వస్తాడా.. ఆ గాయాలతోనే సాహసం చేస్తాడా?

మెగాహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా.దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రిపబ్లిక్“.

 Sai Dharam Tej To Be Attend Republic Movie Promotions-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే చిత్రబృందం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేయాలని భావించారు.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈనెల 26వ తేదీ ఫ్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు.అయితే ఈ సినిమా ప్రమోషన్లలో హీరో సాయి తేజ వస్తారా .రారా.అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.

 Sai Dharam Tej To Be Attend Republic Movie Promotions-రిపబ్లిక్ ప్రమోషన్స్‌కు సాయి తేజ్ వస్తాడా.. ఆ గాయాలతోనే సాహసం చేస్తాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాయి తేజ్ కు సెప్టెంబర్ 10వ తేదీ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అతనికి కాలర్ బోన్ సర్జరీ చేసిన వైద్యులు కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

ఇలాంటి సమయంలో తాను నటించిన రిపబ్లిక్ సినిమా విడుదల కావడంతో సాయి తేజ్ ప్రమోషన్స్ కి దూరం అవుతున్నారని తెలుస్తోంది.అయితే ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం కుదటపడటం వల్ల సినిమా విడుదల రెండు మూడు రోజులు ముందుగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నబోతున్నారని సమాచారం.

Telugu Republic Movie, Republic Movie Pre Release Event, Republic Movie Update, Republic Promotions, Sai Dharam Tej, Sai Tej In Pre Release Event, Sai Tej Republic Movie, Sai Tej Road Accident, Tollywood-Movie

ఇలా ప్రమాదంలో తగిలిన గాయాలతో సాయి తేజ్ ప్రమోషన్లలో పాల్గొనడం ఎంతవరకు సమంజసం అనే ఈ విషయం అర్థం కాకపోయినప్పటికీ వైద్యుల సూచనలు సలహా మేరకు ఇతను బయటకు వస్తారని తెలుస్తోంది.ఏదిఏమైనప్పటికీ తమ హీరో నటించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో తను లేకపోవడం మెగా అభిమానులకు కొంత లోటు కనబడుతుందని చెప్పవచ్చు.ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలకు కమిట్ అయిన సాయి తేజ్ ఈ సినిమాలను డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్లు సమాచారం.

#Sai Tej #Republic #Republic #Sai Tej #Republic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు