తేజూ ఇంకా తెలివి తక్కువ నిర్ణయాలు.. మరిన్ని ఫ్లాప్స్‌ ఖాయం

సుప్రీం హీరో అనే ట్యాగ్‌ ఎప్పుడైతే తేజూ తగిలించుకున్నాడో అప్పటి నుండి కూడా సక్సెస్‌ మొహం ఎరగలేదు.గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ మెగా హీరో నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడుతూ వస్తున్నాయి.

 Sai Dharam Tej That Mistake Again About His Next-TeluguStop.com

ఇటీవలే ‘ఇంటిలిజెంట్‌’ చిత్రంతో ఫ్లాప్‌ను చవిచూసిన తేజూ ఆ ఫ్లాప్‌ను మర్చిపోక ముందే మరో ఫ్లాప్‌ ‘తేజ్‌ ఐలవ్‌ యూ’ రూపంలో వచ్చేసింది.కరుణాకరణ్‌ దర్శకత్వంలో అనగానే అంచనాలు పెరిగాయి.

కాని అంచనాలకు తగ్గట్లుగా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు.తేజ్‌కు మరో ఫ్లాప్‌ ఖాతాలో పడ్డట్లయ్యింది.

వరుసగా ఫ్లాప్స్‌ వస్తున్నా కూడా తేజూ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు.ప్రస్తుతం ఈయన కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు.

‘నేను శైలజ’ మరియు ‘నేను లోకల్‌’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కిషోర్‌ తిరుమలపై తేజూ చాలా నమ్మకం పెట్టుకుని చిత్రాన్ని చేస్తున్నాడు.మైత్రి మూవీస్‌ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో సినీ వర్గాల్లో కూడా అంచనాలున్నాయి.

ఈ సినిమా పూర్తి అయిన తర్వాత తేజూ మరో సినిమాకు కమిట్‌ అయ్యి ఉంటే బాగుండేది.కాని అనూహ్యంగా అప్పుడే తేజూ మరో సినిమాకు కమిట్‌ అయ్యాడు.

త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం కాబోతుంది.

కొత్త దర్శకుడు గోపాల్‌ చెప్పిన కథ తేజూకు నచ్చడంతో వెంటనే ఆ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.నిన్నకాక మొన్ననే సినిమా విడుదలైంది.అప్పుడే కొత్త సినిమా ఎంపికకు తొందర ఏంటీ అంటూ సన్నిహితులు సున్నితంగా హెచ్చరిస్తూ ఉన్నా కూడా తేజూ మాత్రం తగ్గడం లేదు.

ఒక వైపు కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో సినిమాను చేస్తూనే మరో వైపు గోపాల్‌ దర్శకత్వంలో మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో మూవీ ఈమద్యనే ప్రారంభం అయ్యింది.

ఆ సినిమా పూర్తి అయ్యే వరకు వెయిట్‌ చేస్తే బాగుండేది, ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తే గత ఫలితాలు పునరావృతం కావడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ కూడా హెచ్చరిస్తున్నారు.

ఎవరేం చెప్పినా కూడా తేజూ మాత్రం వరుసగా చిత్రాలను చేస్తూ సినిమాల సంఖ్య పెంచుకోవాలనే చూస్తున్నాడు.

ఆ క్రమంలో ఈయన కెరీర్‌ సినిమా సినిమాకు దిగజారి పోతుందనే విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు.కిషోర్‌ తిరుమల సినిమా సక్సెస్‌ అయితే కాస్త ఈయన కుదుట పడ్డట్లు అవుతుంది.

ఆ తర్వాత గోపాల్‌ దర్శకత్వంలో మూవీ తలకిందు అయితే మళ్లీ ఈయనకు వరుసగా ఫ్లాప్‌లు పడటం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలివి తక్కువ నిర్ణయాలతో తేజూ చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube