నభా నటేష్ ని సర్ప్రైజ్ చేసిన తేజు

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కుర్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న కన్నడ భామ నభా నటేష్.ఇస్మార్ట్ శంకర్ తో ఒక్కసారిగా ఈ అమ్మడుపై అందరి దృష్టి పడింది.

 Sai Dharam Tej Special Gift To Nabha Natesh, Tollywood, Solo Brathuke So Better-TeluguStop.com

హైపర్ యాక్టివ్ పాత్రలకి బెస్ట్ ఛాయస్ నభాని దర్శకులు చూస్తున్నారు.ఒకప్పుడు టాలీవుడ్ జెనీలియా ప్లేస్ ని నభా రిప్లేస్ చేస్తుందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.

క్యూట్ గా కనిపిస్తూనే హాట్ గా రెచ్చగొట్టడానికి కూడా ఈ అమ్మడు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో నభాకి అవకాశాలు భాగానే వస్తున్నాయి.ప్రస్తుతం ఈ భామ తేజుతో సోలో బ్రతుకే సో బెటరు, బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమాలు చేస్తుంది.

ఈ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి.ఇదిలా ఉంటే సోలో బ్రతుకే సో బెటరు మూవీ షూటింగ్ లాక్ డౌన్ తర్వాత మరల కొద్ది రోజుల క్రితం స్టార్ట్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో నభా కూడా పాల్గొంది.

ఆమెకి సంబందించిన షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ సెండ్ ఆఫ్ ఇచ్చింది.

ఈ సందర్భంగా నభాకి సాయి ధరమ్ తేజ్ అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి థ్రిల్ చేశాడు.ఇందులో థ్యాంక్యూ న‌భా అని రాయ‌డంతో పాటు తెల్ల‌ని దుస్తులు, న‌భా ఫోటో ఫ్రేమ్, కొన్ని కాస్మెటిక్స్ ఉన్నాయి.

ఈ గిఫ్ట్ చూసిన నభా తేజుకి ఫిదా అయిపోయిందని టాక్.మొత్తానికి తేజు గిఫ్ట్ ఇచ్చి నభాని బుట్టలోకి ఈ విధంగా వేసుకున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తేజు హీరోయిన్స్ తో ఫ్రెండ్లీ నేచర్ తో ఉంటాడు.అందులో భాగంగా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత తనతో నటించిన ప్రతి హీరోయిన్ కి ఇలా గిఫ్ట్స్ ఇవ్వడం చేస్తూ ఉంటాడని చెప్పుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube