తేజు కారణంగా నో పెళ్లి అంటోన్న రానా.. వంతపాడిన వరుణ్!  

Sai Dharam Tej Solo Brathuke So Better Varun Tej - Telugu Nabha Natesh, Rana Daggubati, Sai Dharam Tej, Solo Brathuke So Better, Varun Tej

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు తేజు రెడీ అవుతున్నాడు.

 Sai Dharam Tej Solo Brathuke So Better Varun Tej

కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి.ఇక ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా నుండి ఓ సింగిల్ సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

‘నో పెళ్లి’ అంటూ సాగే ఈ పాట చాలా క్రేజీగా ఉండటంతో యూత్ ఈ పాటకు బాగా కనెక్ట్ అవుతున్నారు.థమన్ అందించిన మ్యూజిక్ ఈ పాటకు బాగా కలిసి రావడం, ఈ పాటలో ఎవ్వరూ ఊహించని విధంగా మరో ఇద్దరు యంగ్ హీరోలు ఉండటంతో ఈ పాటను పదే పదే చూస్తున్నారు.

తేజు కారణంగా నో పెళ్లి అంటోన్న రానా.. వంతపాడిన వరుణ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రానా దగ్గుబాటి ఈ పాటలో కేమియో ఇవ్వడంతో ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యారు.ఇక ఈ పాటలో రానా కూడా ఉండటంతో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న రానా, అప్పుడే ‘నో పెళ్లి.

అంటూ పాడటం ఏమిటని పలువురు సరదాగా కౌంటర్‌లు వేస్తున్నారు.

సుబ్బు అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ యూత్‌ఫుల్ మూవీలో సాయి ధరమ్ తేజ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, హీరోయిన్‌గా నభా నటేష్ అదరగొడుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండటంతో ఇది ఖచ్చితంగా మ్యూజికల్ హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.మరి తేజు నో పెళ్లి సాంగ్‌ను మీరు ఓసారి చూసేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు