ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల అవ్వబోతుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడుతుందన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఈ మధ్యనే సాయి ధరమ్ తేజ్ యాక్సిండెంట్ లో గాయపడిన విషయం అందరికి తెలుసు.
సాయి ధరమ్ తేజ్ బైక్ మీద వెళ్తూ యాక్సిడెంట్ అయి తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే.సాయి ధరమ్ తేజ్ కు బైక్ ప్రమాదం జరగకపోయి ఉంటే ఈ పాటికి రిపబ్లిక్ ప్రమోషన్స్ తో బిజీగా ఉండేవాడు.
కానీ అనుకున్న విధంగా జరగలేదు.సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడం వల్ల రిపబ్లిక్ సినిమాను వాయిదా వేయాలని అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది.
ప్రెసెంట్ సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల ఈ సినిమాను కొద్దీ రోజులు వాయిదా వేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేయాలనీ నిర్మాత ఆలోచిస్తున్నట్టు సమాచారం.అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం తెలియదు.ఇక దేవ కట్టా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది.జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జె.భగవాన్, పుల్లారావు ఈ సినిమాను నిర్మిస్తుండగా.మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
రిపబ్లిక్ సినిమాలో సాయి తేజ్ కలెక్టర్ రోల్ లో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది.