థియేటర్స్ ఓపెన్ అవ్వగానే బరిలోకి దిగబోతున్న తేజ్ !

మెగాస్టార్ మేనల్లుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్.అంతేకాదు వరస సినిమాలు చేస్తూ హిట్స్ కూడా అందుకున్నాడు.

 Sai Dharam Tej Republic Movie Latest Update-TeluguStop.com

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రిపబ్లిక్.ఈ సినిమాకు దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది.

 Sai Dharam Tej Republic Movie Latest Update-థియేటర్స్ ఓపెన్ అవ్వగానే బరిలోకి దిగబోతున్న తేజ్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దర్శకుడు దేవ కట్టా ఈ సినిమాను పొలిటికల్ త్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది.సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఈ సినిమాలో సి ఎం పాత్రలో నటిస్తుంది.

కొద్దిరోజుల క్రితం రమ్య కృష్ణ లుక్ కూడా రివీల్ చేసారు.ఈ సినిమాలో కూడా ఈమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చిత్ర యూనిట్ మొదటి నుండి చెబుతున్నారు.

Telugu Aishwarya Rajesh, Deva Katta, Political Thriller Movie, Ramya Krishna, Republic Movie, Sai Dharam Tej, Sai Dharam Tej Republic Movie Latest Update-Movie

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడు.సాయి ధరమ్ 14 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.

అయితే ఇప్పుడిప్పుడే దేశంలో పరిస్థితులు మళ్ళీ మాములు స్థితికి వస్తున్నాయి.

అందుకే ఈ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాలనీ అనుకుంటున్నారట.ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేశారట.

వచ్చే నెల థియేటర్స్ ఓపెన్ అవుతాయని అనుకుంటున్నారని తెలుస్తుంది.

Telugu Aishwarya Rajesh, Deva Katta, Political Thriller Movie, Ramya Krishna, Republic Movie, Sai Dharam Tej, Sai Dharam Tej Republic Movie Latest Update-Movie

ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేటర్స్ ఓపెన్ అవ్వగానే విడుదల చేయాలనీ మేకర్స్ అనుకుంటున్నారని అందుకు పనులు కూడా పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది.త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.మరి చూడాలి ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తాడో.

#Deva Katta #Ramya Krishna #SaiDharam #Sai Dharam Tej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు