జనసేనకు ఎందుకు ప్రచారం చేయడం లేదంటే సాయి ధరమ్‌ తేజ్‌ ఏమన్నాడో తెలుసా?  

Sai Dharam Tej Reason For Not Campaigning For Janasena-election Campaigning,janasena,pawan,political Updates,sai Dharam Tej

  • మెగా హీరోలు జనసేన పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని అంతా భావించారు. కాని నాగబాబు కోసం ఆయన కొడుకు వరుణ్‌ తేజ్‌ మినహా మరెవ్వరు కూడా రోడ్డు ఎక్కలేదు.

  • జనసేనకు ఎందుకు ప్రచారం చేయడం లేదంటే సాయి ధరమ్‌ తేజ్‌ ఏమన్నాడో తెలుసా?-Sai Dharam Tej Reason For Not Campaigning For Janasena

  • జనసేనకు మద్దతు తెలుపుతూ అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, కళ్యాణ్‌ దేవ్‌లు సోషల్‌ మీడియా పోస్ట్‌లు చేశారు తప్ప రోడ్డు మీదకు రాలేదు. వారంతా కూడా పవన్‌ కళ్యాణ్‌ కోసం, జనసేన కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అంటూ అంతా భావించారు.

  • కాని వారు మాత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. వారు ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనడం లేదు అనే విషయమై సాయి ధరమ్‌ తేజ్‌ క్లారిటీ ఇచ్చాడు.

  • మామయ్య కోసం మీరు ఎందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు అంటూ మీడియా వారు సాయి ధరమ్‌ తేజ్‌ను ప్రశ్నించిన సమయంలో నాకు మామయ్య నుండి అనుమతి రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ‘చిత్రలహరి’ చిత్రం విడుదల సందర్బంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ ఆ తర్వాత మీడియాతో మాట్లాడాడు. సినిమాలు మరియు రాజకీయం రెండు చేయడం మంచిది కాదు, రెండు పడవల ప్రయాణం కరెక్ట్‌ కాదు, అందుకే నువ్వు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని మామయ్య అన్నాడు.

  • ఆయన ఆదేశాలకు విరుద్దంగా నేను ఏం చేయలేను. ఖచ్చితంగా నేను ఒక అభిమానిగా ఆయన గెలుపును కోరుకుంటున్నాను అన్నాడు.

  • Sai Dharam Tej Reason For Not Campaigning Janasena-Election Janasena Pawan Political Updates

    సాయి ధరమ్‌ తేజ్‌ను వారించినట్లుగానే రామ్‌ చరణ్‌ ను కూడా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ వద్దని ఉంటాడు. అందుకే వైజాగ్‌లో ప్రచారం చేయాలనుకున్న రామ్‌ చరణ్‌ పెద్దగా జనసేన తరపున ప్రచారం చేయకుండానే వెళ్లి పోయాడు. మూడు నాలుగు రోజుల పాటు జనసేన కోసం రామ్‌ చరణ్‌ ప్రచారం చేయాలనుకున్నాడట.

  • కాని బాబాయి పవన్‌ వద్దన్న కారణంగా ఊరికే ఉన్నాడని ఇప్పటికే మీడియాలో వార్తలు వస్తున్నాయి.