కథ బాగుంటే వెబ్ సిరీస్ అయిన ఓకే అంటున్న సాయి ధరమ్ తేజ్

ఈ మధ్యకాలంలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా ఎక్కువైంది.వెబ్ సిరీస్ లు చూసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది.

 Sai Dharam Tej Ready Entry In Web Series, Mega Heroes, Tollywood, Ott Platform,-TeluguStop.com

కరోనా పరిస్థితులు కూడా ఓటీటీ చానల్స్ లో ప్రసారం అయ్యే వెబ్ సిరీస్ లు చూడటానికి ఆసక్తి చూపించేలా చేశాయి.ప్రజలు చాలా వరకు ఇంటిపట్టునే ఉండటంతో పాటు 4జీ డేటా సర్వీస్ ఉండటంతో ఆన్ లైన్ ప్రపంచంలో ఎక్కువ కాలక్షేపం చేస్తూ టీవీ కంటే డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ నేపధ్యంలో వెబ్ సిరీస్ లని కొత్త కొత్త కంటెంట్ లతో డిజిటల్ చానల్స్ అందిస్తున్నాయి.ఇక ఈ వెబ్ సిరీస్ లకి భాషా పరిధులు, అలాగే సెన్సార్ లేకపోవడంతో దర్శకులు వారు చెప్పాలనుకున్న కంటెంట్ ని సూటిగా చెబుతున్నారు.

ఎక్కువగా డ్రామా లేకుండా కంటెంట్ ని, స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ప్రెజెంట్ చేస్తున్నారు.

వెబ్ సిరీస్ లకి డిమాండ్ పెరగడంతో స్టార్ దర్శకులతో పాటు, హీరోయిన్స్ అందరూ ఈ దారిలోకి వస్తున్నారు.

హీరోయిన్స్ అయితే తమ యాక్టింగ్ కెరియర్ ని పెంచుకోవడానికి వెబ్ సిరీస్ లని ఒక అవకాశంగా చూస్తున్నారు.ఇప్పటివరకు రొటీన్ హీరోయిన్ పాత్రలు చేసి బోర్ కొట్టిన వారు వెబ్ సిరీస్ లలో డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పుడు ఈ దారిలోకి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా రావడానికి ఆసక్తిగానే ఉన్నట్లు తెలుస్తుంది.తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను వెబ్ సిరీస్ లలో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు.

తాను కథని బిలీవ్ చేస్తానని, కథలో బాగుండి అది ప్రేక్షకులకి రీచ్ అవుతుంది అనిపిస్తే వెబ్ సిరీస్ తనకు ఒకే అని సినిమాలే చేయాలి అని రూల్స్ ఏమీ పెట్టుకోలేదని చెప్పుకొచ్చాడు.మరి తేజ్ ఇచ్చిన ఈ ఆఫర్ ని ఎవరైనా దర్శకులు ఉపయోగించుకొని మంచి వెబ్ సిరీస్ తో అతనిని సంప్రదిస్తారేమో

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube