మెగా సూచన మేరకు టైటిల్‌ మార్చిన మారుతి  

Sai Dharam Tej New Movie Title Is Prathi Roju Pandage-bhogi,chiranjivi,maruthi,prathi Roju Pandage,sai Dharam Tej,మారుతి దర్శకత్వం,మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సినిమాకు సిద్దం అవుతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు మారుతి చెప్పిన కథ చిరంజీవి మరియు అల్లు అరవింద్‌లకు బాగా నచ్చిందట. మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది..

మెగా సూచన మేరకు టైటిల్‌ మార్చిన మారుతి-Sai Dharam Tej New Movie Title Is Prathi Roju Pandage

భారీ అంచనాలున్న ఈ చిత్రంకు మొన్నటి వరకు భోగీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఫీడ్‌ బ్యాక్‌ ఎలా ఉంటుందో అనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు లీక్‌ చేయడం జరిగింది.

మెగా ఫ్యాన్స్‌ నుండి ‘భోగీ’ అనే టైటిల్‌కు పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. దానికి తోడు చిరంజీవి కూడా భోగీ అనే టైటిల్‌ కంటే మరేదైనా మంచి టైటిల్‌ ఆలోచించాలని, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా మంచి టైటిల్‌ను చూడమంటూ మారుతికి సలహా ఇచ్చాడట.

ఈ సమయంలోనే మారుతి ఈ చిత్రానికి ‘ప్రతి రోజు పండుగే’ అనే టైటిల్‌ను అనుకున్నాడట. మెగా వర్గాల నుండి ఆ టైటిల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ దక్కినట్లుగా తెలుస్తోంది.

దర్శకుడు మారుతి టైటిల్‌తోనే సగం సక్సెస్‌ అవుతూ ఉంటాడు. ఆయన గత చిత్రాలు ప్రేమ కథా చిత్రమ్‌, భలే భలే మగాడివోయ్‌ ఇంకా మహానుభావుడు ఇలా విభిన్నమైన టైటిల్‌తో మెప్పించే మారుతి తాజాగా ‘ప్రతి రోజు పండుగే’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ టైటిల్‌ను యూవీ క్రియేషన్స్‌ వారు ఛాంబర్‌లో రిజిస్ట్రర్‌ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రంను యూవీ క్రియేషన్స్‌ వారితో కలిసి నిర్మిస్తున్నాడు.