రూటు మార్చిన సాయి తేజ్.. ఈసారి అయినా సక్సెస్ సాధించేనా?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పిల్ల నువ్వులేని జీవితం సినిమాతో హీరోగా పరిచయం అయ్యి ఒక మోస్తరు హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తర్వాత సుప్రీం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

 Sai Dharam Tej New Movie Latest Update, Bvsn Prasad, Director Karthik Dandu, Sai-TeluguStop.com

సాయి ధరమ్ తేజ్ గత ఏడాది సెప్టెంబర్ లో యాక్సిడెంట్ అయ్యి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ పై సాయి తేజ్ ప్రమాదానికి గురి అవవడంతో ఆసుపత్రిలో చేరాడు.

దాదాపు 35 రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఈయన కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు.

ఈయన ఇప్పటి వరకు విశ్రాంతి తీసుకుంటున్నాడు.అయితే ఈయన ఇటీవలే విశ్రాంతి పూర్తి చేసుకుని తన కొత్త సినిమా స్టార్ట్ చేసాడు.SDT15 స్టార్ట్ అయ్యి వేగంగా పూర్తి కూడా చేసుకుంటుంది.

థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా అప్పుడే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట.

ఈ సినిమాకు శ్రీ ఏవంకటేస్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. ‘SDT15’ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.రెట్టించిన ఉత్సాహంతో సెట్ లోకి అడుగు పెట్టిన సాయి తేజ్ ప్రత్యేక టీమ్ తో కలిసి ఈ సినిమాను ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నాడని సమాచారం.తాజాగా టీమ్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు.

ఈ పిక్ చూస్తుంటే డార్క్ చీకట్లో వెన్నెల వెలుతురూ మధ్య షూట్ సాగుతుందని అర్ధం అవుతుంది.దీంతో ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది.

Telugu Sdt, Bvsn Prasad, Karthik Dandu, Sai Dharam Tej, Saidharam-Movie

ఇది ఇలా ఉండగా సాయి తేజ్ కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమ కథా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అవేమీ కూడా ఈయనను క్రేజీ స్టార్ గా మార్చలేక పోయాయి.అందుకే సాయి తేజ్ నలుగురితో పాటు నడవకుండా కొత్త పంథాలో నడుస్తున్నాడు.ఇప్పటి వరకు లవ్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాయి తేజ్ ఇప్పుడు రూట్ మార్చి కొత్త పంథాలో సినిమాలు చేస్తున్నాడు.

ఇలాంటి కొత్త జానర్ సినిమాలు అతడిని నటుడిగా మరింత దృడంగా మార్చడం ఖాయం.చూడాలి మరి ఈయన ఎంచుకున్న జానర్ లు అయినా హిట్ తెచ్చిపెడతాయో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube