వచ్చే ఏడాది పెళ్లి విషయంపై మెగా హీరో క్లారిటీ  

Sai Dharam Tej Marriage Tollywood - Telugu Deva Katta, Sai Dharam Tej, Sai Dharam Tej Marriage, Solo Brathuke So Better, Tollywood

సాయి ధరమ్ తేజ్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ ఏడాదిలో సాయి వివాహ నిశ్చితార్థం కానుండగా వచ్చే ఏడాది పెళ్లి చేయాలని నిర్ణయించారు అంటూ ప్రచారం జరిగింది.

 Sai Dharam Tej Marriage Tollywood

అయితే ఈ విషయంలో సాయి ధరమ్ తేజ్ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చాడు.

వచ్చే ఏడాది కాదు మరో రెండు సంవత్సరాల తర్వాత కూడా తన పెళ్లి ఉండక పోవచ్చు అంటూ సాయి ధరమ్ తేజ్ అన్నాడు.

వచ్చే ఏడాది పెళ్లి విషయంపై మెగా హీరో క్లారిటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రస్తుతానికి మొత్తం దృష్టి సినిమాలపైనే ఉందని.జీవితం లో ఇంకా చాలా పెడ్డింగ్ లో ఉన్నాయి.ఆ విషయాల్లో క్లారిటీ వస్తే తప్ప తాను పెళ్లి చేసుకోను అన్నాడు.తల్లి దండ్రులు విడాకులు తీసుకున్న కారణంగా ఈయనకు వెంటనే పెళ్లి చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంలో మెగా ఫ్యామిలీ ఉంది.

సాయి ధరమ్ తేజ్ మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకునే అవకాశం కనిపించడం లేదు.ప్రస్తుతం షూటింగ్స్ లేని కారణంగా ఇంటికే పరిమితం అయిన తేజ్ త్వరలోనే తన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆ సినిమా తర్వాత దేవా కట్ట దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ఇప్పటికే ఒకే చెప్పాడు.ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమా కూడా చర్చల దశలో ఉందని సమాచారం అందుతోంది

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test