సాయి తేజ్ హెల్త్ అప్డేట్.. బాగుంది కానీ మరికొన్ని రోజులు అలా చేయ్యాల్సిందే!

సినీనటుడు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం సాయంత్రం ద్విచక్ర వాహనం పై ప్రయాణం చేస్తూ కేబుల్ బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.ఒక్కసారిగా మెగాహీరో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారని తెలియడంతో పెద్దఎత్తున సినీ నటీనటులు, అభిమానులు ఎంతో కంగారుపడుతూ తనకు ఏ విధమైనటువంటి ప్రమాదం జరగకూడదని సురక్షితంగా బయటకు రావాలని ప్రార్థించారు.

 Mega Hero Sai Dharam Tej Health Updates, Mega Hero Sai Dharam Tej ,sai Dharam Te-TeluguStop.com

ఇలా కేబుల్ బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ ను దగ్గరలో ఉన్నటువంటి మెడికవర్ ఆస్పత్రికి సరైన సమయంలో తరలించడం వల్ల అతని ప్రాణాలు ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు.
ఈ క్రమంలోనే సాయి తేజ్ రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న మెగా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకొని అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు.

ఒకరోజు పాటు సృహ లోకి రాని సాయి తేజ్ మరుసటి రోజు స్పృహలోకి రావడం చేత అతనికి కాలర్ బోన్ సర్జరీ నిర్వహించారు.ఈ సర్జరీ తర్వాత సాయి తేజ్ ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు.

అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ను డాక్టర్లు విడుదల చేశారు.

Telugu Apollo Doctors, Sai Dharam Tej, Sai Dharam Bike, Saidharam, Tollywood-Mov

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని.ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతుందని వైద్యులు వెల్లడించారు.ప్రస్తుతం వెంటిలేటర్ సదుపాయం లేకుండా స్పృహలోకి వచ్చిన సాయి.

తనంతట తానే శ్వాస తీసుకుంటున్నారని వైద్యులు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ మరికొన్ని రోజులపాటు సాయి తేజ్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని ఈ సందర్భంగా వైద్యులు సూచించారు.

సాయి తేజ్ సురక్షితంగా బయటకు రావాలని ఎంతోమంది అభిమానులు మొక్కిన మొక్కులు అతనిని ప్రమాదం నుంచి గట్టెక్కించాయని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube