నందమూరి హీరోల బాటలో మెగా హీరో  

Sai Dharam Tej Krishnadevarayalu - Telugu Balakrsihna, Krishnadevarayalu, Ntr, Sai Dharam Tej

నందమూరి హీరోలు తమకంటూ కొన్ని ప్రత్యేక పాత్రలను వెండితెరపై ఆవిష్కరించి, వాటిని మరెవ్వరూ టచ్ చేయని విధంగా సినిమాల్లో రికార్డులకెక్కారు.ముఖ్యంగా ఎన్టీఆర్ చేసిన పాత్రలను అప్పట్లో మరెవ్వరూ చేసేవారు కారు.

 Sai Dharam Tej Krishnadevarayalu

దీంతో అదే వారసత్వాన్ని నందమూరి బాలకృష్ణ కంటిన్యూ చేశాడు.ఇప్పటికే పౌరాణిక, సామాజిక పాత్రల్లో మె్పించిన బాలయ్య, ప్యూర్ జానపద చిత్రాల్లోనూ ప్రేక్షకులను మెప్పించాడు.

అయితే పౌరాణిక వేశాలు వేయడంలో ఎప్పుడూ నందమూరి హీరోలే ముందుంటారు.కాగా గతంలో శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ నటించి మెప్పించాడు.ఆ తరువాత ఆ పాత్రను బాలకృష్ణ తన ఆదిత్య 369 మూవీలో చేశాడు.ఈ ఇద్దరు హీరోలు కూడా ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు.

నందమూరి హీరోల బాటలో మెగా హీరో-Gossips-Telugu Tollywood Photo Image

కాగా ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ పాత్రలో నటించి మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలో నటిస్తున్న తేజు, త్వరలోనే వీరూ పోట్ల దర్శకత్వంలో ఓ పీరియాడికల్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో తేజు శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.అయితే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.ఏదేమైనా మెగా ఫ్యామిలీలో ఈ పాత్రలో నటించబోయే తొలి హీరోగా తేజు రికార్డు కొట్టడం ఖాయం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sai Dharam Tej Krishnadevarayalu Related Telugu News,Photos/Pics,Images..

footer-test