చిత్రలహరితో హిట్ గ్యారెంటీ అంటున్న సాయి ధరమ్ తేజ్  

Sai Dharam Tej Have Expectations On Chitralahari Movie-

వరుసగా రెండు హ్యాట్రిక్ డిజాస్టర్స్ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా చిత్రలహరి.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మూడు విభిన్న వ్యక్తిత్వాలు వారి మధ్య పరిచయం, ప్రేమ అనే కోణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుంటుంది.

Sai Dharam Tej Have Expectations On Chitralahari Movie- Telugu Tollywood Movie Cinema Film Latest News Sai Dharam Tej Have Expectations On Chitralahari Movie--Sai Dharam Tej Have Expectations On Chitralahari Movie-

ఎలా అయిన ఈ సారి హిట్ కొట్టాలనే కసితో ఉన్న తేజ్ కి చిత్రలహరి టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ నేపధ్యంలో సినిమా హిట్ పై తేజ్ భారీ అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది.


నివేతా పెతురాజ్, కల్యాణి ప్రియదర్శి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇక అతని గత సినిమాల ట్రాక్ ప్రకారం చూసుకుంటే ఇది కచ్చితంగా ఓ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో నడిచే చిత్రం అవుతుందని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇప్పటి వరకు కమర్షియల్ హీరోగా సక్సెస్ కోసం ట్రై చేసిన తేజ్ కి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రలహరి ఎ మేరకు సక్సెస్ ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఏప్రిల్ 12న రాబోతున్న ఈ సినిమాపై తేజ్ మాత్రం గట్టిగా ఆశలు పెట్టుకున్నాడని చెప్పొచ్చు.

.

తాజా వార్తలు