ఆ ఆపరేషన్‌ చేయించుకోలేదు మొర్రో అంటున్న మెగా హీరో  

Sai Dharam Tej Gives Clarity About Lipo And Hair Patching Surgerys-jawan Movie,lipo And Hair Patching Surgerys,sai Dharam Tej

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ‘చిత్రలహరి’ చిత్రం ప్రారంభంకు ముందు దాదాపు ఆరు నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో తేజ్‌ అమెరికా కూడా వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. బాగా లావు అవ్వడం వల్ల తేజూ లైపో చేయించుకునేందుకు అమెరికా వెళ్లాడు అంటూ వార్తలు వచ్చాయి. లావు తగ్గడంతో పాటు, జుట్టు ఊడిపోతున్న కారణంగా హెయిర్‌ ట్రీట్‌మెంట్‌ కూడా చేయించుకున్నాడు అంటూ ప్రచారం జరిగింది..

ఆ ఆపరేషన్‌ చేయించుకోలేదు మొర్రో అంటున్న మెగా హీరో-Sai Dharam Tej Gives Clarity About Lipo And Hair Patching Surgerys

తాజాగా చిత్రలహరి చిత్రం విడుదల సందర్బంగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న సాయి ధరమ్‌ తేజ్‌ క్లారిటీ ఇచ్చాడు.

తనపై వచ్చిన వార్తలు అన్ని కూడా పుకార్లే అని, అసలు అలాంటి పుకార్లు రావడం చిత్రంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. తాను అమెరికా వెళ్లిన మాట వాస్తవమే కాని, కాలిగాయంకు చికిత్స తీసుకునేందుకు వెళ్లినట్లుగా చెప్పుకొచ్చాడు.

కాలి గాయం చాలా రోజుల పాటు ఇబ్బంది పెట్టినందు వల్ల దానికి శాస్వత పరిష్కారం కోసం అమెరికా వెళ్లినట్లుగా చెప్పాడు. అక్కడ తాను ఆర్ధో ఫిజీషియన్‌ను కలిశాను అని, వారి వద్ద చికిత్స తీసుకున్న నాకు ప్రస్తుతం పూర్తి రిలాక్స్‌గా ఉందని పేర్కొన్నాడు.

వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్‌ అయిన నేపథ్యంలో చిత్రలహరి చిత్రం తేజూకు చాలా కీలకంగా మారింది. దాంతో ఈ చిత్రంను ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించాడు.

ఈ చిత్రంలో తేజూ కాస్త లావు తగ్గినట్లుగా కూడా అనిపిస్తుంది. లావు తగ్గడంతో పాటు, కొత్త లుక్‌ను ట్రై చేశాడు. తప్పకుండా ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకంను తేజూ వ్యక్తం చేస్తున్నాడు..