పెళ్లివార్తల్లో నిజం లేదన్న సాయి ధరమ్ తేజ్.. కానీ..?

టాలీవుడ్ యంగ్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల జాబితాను పరిశీలిస్తే అందులో సాయిధరమ్ తేజ్ ముందువరసలో ఉంటారు.చాలారోజుల నుంచి సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.

 Sai Dharam Tej Gave Clarity About Marriage Rumours,mega Hero Sai Dharam Tej, Mar-TeluguStop.com

నిహారిక నిశ్చితార్థం తరువాత సాయిధరమ్ తేజ్ కు కూడా పెళ్లి కుదిరిందని త్వరలోనే అధికారికంగా ప్రకటన రావచ్చని వార్తలు వెలువడ్డాయి.అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

స్వయంగా సాయిధరమ్ తేజ్ వైరల్ అవుతున్న పెళ్లి వార్తల గురించి తనకు పెళ్లి కుదిరిందని వైరల్ అయిన వార్తలో నిజం లేదని స్పష్టతనిచ్చారు.అయితే పెళ్లికూతురును వెతికే పనిలో కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారని.

త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయని అన్నారు.లాక్ డౌన్ సమయంలో చాలామంది హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి కాని హీరోహీరోయిన్లను అభిమానులు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

సాయిధరమ్ తేజ్ కు చేసుకోబోయే అమ్మాయి ఎవరో ఫిక్స్ అయినప్పటికీ నిహారిక పెళ్లి వల్ల ఆ విషయాలను వెల్లడించడం లేదని కూడా జోరుగా ప్రచారం సాగడం గమనార్హం.సాయిధరమ్ తేజ్ అమ్మాయి బావుంటే మంచి సంబంధం తీసుకొస్తే అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తానని.

ప్రస్తుతానికైతే పెళ్లి గురించి పెద్దగా ఆసక్తి లేదని.కుటుంబ సభ్యులు మాత్రం గట్టిగా పట్టుబట్టడంతో పెళ్లి సంబంధాలు చూడటానికి మాత్రం ఒప్పుకున్నానని అన్నారు.

అయితే ఈ ఏడాది సాయిధరమ్ తేజ్ పెళ్లి జరగకపోయినా అమ్మాయిని వెతికే పనిలో కుటుంబ సభ్యులు బిజీ కావడంతో వచ్చే ఏడాది సాయిధరమ్ తేజ్ పెళ్లి జరగవచ్చని అభిమానులు భావిస్తున్నారు.మరోవైపు గతేడాది ప్రతిరోజూ పండగే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సాయిధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా త్వరలో విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube