మిలియన్ లైక్స్ తో రికార్డ్ సృష్టించిన సాయి ధరమ్ తేజ్ డబ్బింగ్ సినిమాలు

మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి మేనల్లుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరో సాయి ధరమ్ తేజ్.తేజ్ మొదటి సినిమా డిజాస్టర్ అయిన రెండో సినిమా నుంచి వరుసగా హ్యాట్రిక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

 Sai Dharam Tej Hindi Dubbed Movies One Million Likes Record, Chitralahari Movie,-TeluguStop.com

తరువాత మళ్ళీ ఐదు డిజాస్టర్స్ తో బ్యాక్ కి వెళ్ళిపోయాడు.మళ్ళీ చిత్రలహరి సినిమాతో ట్రాక్ ఎక్కాడు.

ప్రస్తుతం దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే మూవీలో నటిస్తున్నాడు.ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలని హిందీలో డబ్ చేసి యుట్యూబ్ లో వదులుతున్నారు.నార్త్ ఇండియా ప్రేక్షకుల నుంచి ఈ సినిమాలకి విశేషమైన ఆదరణ లభిస్తూ ఉండటంతో కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు అదే వ్యాపారంగా పెట్టుకున్నాయి.

ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాలకి హిందీ డబ్బింగ్ లో మంచి ఆదరణ ఉంది.తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ మూవీస్ కి కూడా హిందీలో మంచి ఇమేజ్ ఉంది.

ఇలా డబ్బింగ్ సినిమాలతో హిందీలో సక్సెస్ అవ్వడంతో ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు బాలీవుడ్ లో నేరుగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయారు.పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు.

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ అయితే ఛత్రపతి రీమేక్ తో స్ట్రైట్ హిందీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

Telugu Allu Arju, Chatrapati, Chitralahari, Sai Dharam Tej, Saitej, Tej Love, To

ఇదిలా ఉంటే వీరి తర్వాత హిందీ డబ్బింగ్ లో సాయి ధరమ్ తేజ్ సినిమాలకి మంచి స్పందన ఉంది.తేజ్ కరుణాకర్ దర్శకత్వంలో చేసిన తేజ్ ఐ లవ్ యు మూవీ 1.3 మిలియన్ లైక్స్ వచ్చాయి.అలాగే మారుతి-తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి రోజు పండగే మూవీకి 1.1 మిలియన్ లైక్స్ వచ్చాయి.ఇక కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రలహరిని ప్రేమమ్ పేరుతో డబ్బింగ్ చేయగా దీనికి 102 మిలియన్ వ్యూస్ తో పాటు 1 మిలియన్ లైక్స్ వచ్చాయి.మొత్తానికి మూడు సినిమాలతో వన్ మిలియన్ లైక్స్ క్లబ్ లో చేరిన హీరోగా తేజ్ ఇప్పుడు చేరిపోయాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube