శిరీష్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన తేజు

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు.వరుసగా సినిమాలు చేయడమే కాకుండా వాటిని సక్సెస్‌లుగా మలుచుకుని తన కెరీర్ సెట్ చేసుకుని దూసుకుపోతున్నాడు.

 Sai Dharam Tej Clarity On Allu Sirish Marriage, Sai Dharam Tej, Allu Sirish, Sol-TeluguStop.com

కాగా ఆయన నటించిన తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ పలుమార్లు రిలీజ్ వాయిదా వేసుకుని ఎట్టకేలకు క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న తేజు, తాజాగా ఆయన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

గతకొంత కాలంగా తేజు పెళ్లిపై అనేక వార్తలు వస్తుండటంతో వాటిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.ఈ క్రమంలోనే మరో మెగా హీరో అల్లు శిరీష్ పెళ్లి గురించి ఆయన కుండబద్దలు కొట్టేశాడు.

శిరీష్ తనకంటే పెద్దవాడని, ఆయన పెళ్లి వచ్చే ఏడాదిలో జరగనుందని, ఆ తరువాత తాను పెళ్లి చేసుకుంటానని తేజు తేల్చి చెప్పాడు.తనకు కొన్ని కోరికలు ఉన్నాయని, అవి పెళ్లిలోపు తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తేజు చెప్పాడు.

పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని, తనకంటే పెద్దవారు చాలా మంది ఉన్నారంటూ మాట దాటేసే ప్రయత్నం చేశాడు తేజు.

మొత్తానికి తన పెళ్లి గురించి చెబుతూనే తన ఫ్యామిలీలోని మరో మెగా హీరో పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు తేజు.

ఇటీవల మెగా డాటర్ నిహారికా వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.దీంతో ఇప్పుడు మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి వేడుక జరగనుందనే వార్త అప్పుడే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక తేజు సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని సుబ్బు డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు తేజు.

మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube