వైష్ణవ్‌ తేజ్‌ విషయంలో ఆ తప్పు జరగనివ్వరట!   Sai Dharam Tej Brother Vaishnav Tej Entry Is Confirmed In Tollywood     2018-10-27   10:17:32  IST  Ramesh P

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరోగా వైష్ణవ్‌ తేజ్‌ ఎంట్రీకి సిద్దం అవుతున్నాడు. అల్లు శిరీష్‌ మరియు కళ్యాణ్‌ దేవ్‌లు మినహా మిగిలిన హీరోలు అంతా కూడా మంచి సినిమాలతో అలరిస్తూ దూసుకు పోతున్నారు. వీరిద్దరి మాత్రం పెద్దగా గుర్తింను దక్కించుకోవడంలో విఫలం అయ్యారు. అందుకే వారిలా కాకుండా వైష్ణవ్‌ తేజ్‌ విషయంలో జాగ్రత్తలు పడుతున్నారు. వరుసగా పెద్ద సినిమాల్లో మాత్రమే వైష్ణవ్‌ను నటింపజేయాలని, అదే విధంగా వైష్ణవ్‌ తేజ్‌ సినిమా ఫంక్షన్స్‌ను భారీ ఎత్తున చేసి, మెగా ఫ్యాన్స్‌కు పరిచయం చేయాలని మెగా ఫ్యామిలీ భావిస్తోంది.

వైష్ణవ్‌ మొదటి చిత్రాన్ని రామ్‌ తాళ్లూరి నిర్మించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని రామ్‌ తాళ్లూరి కంటే ముందు మైత్రి మూవీస్‌లో ఈయన సినిమా ఉండే అవకాశం ఉంది. సుకుమార్‌తో కలిసి మైత్రి మూవీస్‌ వారు ఒక చిత్రాన్ని వైష్ణవ్‌ తేజ్‌తో ప్లాన్‌ చేస్తున్నారు. సుకుమార్‌ నిర్మాణంతో పాటు స్క్రిప్ట్‌ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నాడు. ఆ కారణంగానే మెగా ఫ్యామిలీ వారు వైష్ణవ్‌ తేజ్‌ను సుకుమార్‌ చేతిలో పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యింది. అతి త్వరలోనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Sai Dharam Tej Brother Vaishnav Entry Is Confirmed In Tollywood-

సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసి, సుకుమార్‌కు ఆప్తుడిగా పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్‌ సినిమా తెరకెక్కబోతుంది. మొదటి నుండి చివరి వరకు సుకుమార్‌ ఆధ్వర్యంలోనే చిత్రీకరణ జరుపనున్నారు. సుకుమార్‌ దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్న కారణంగా సినిమా ఖచ్చితంగా ఓ రేంజ్‌లో ఉండి మొదటి సినిమాతోనే వైష్ణవ్‌కు మంచి గుర్తింపు రావడంతో పాటు, కమర్షియల్‌ హీరో అనే పేరు రావడం ఖాయం అన్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు. మొదటి సినిమా సక్సెస్‌ అయితేనే కెరీర్‌లో ముందుకు సాగగలరు. అందుకే వైష్ణవ్‌ మొదటి సినిమాకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.